రాహుల్ గాంధీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: ఎన్నికల సంఘం
x

రాహుల్ గాంధీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: ఎన్నికల సంఘం

బీహార్ ‘సర్’ కమిషన్ ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయమే అని ప్రకటన, ఫామ్-6 పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆక్షేపణ


Click the Play button to hear this message in audio format

ఫారం-6 పై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలపై ఎన్నికల సంఘం ఆక్షేపించింది. ఇది కేవలం తప్పుదారి పట్టించే వ్యాఖ్యలుగా కొట్టిపారేసింది. సుప్రీంకోర్టు సమర్థించిన బీహార్ ‘సర్’ ఉత్తర్వూ ద్వారా ఆ ఫారానికి ఒక డిక్లరేషన్ జతచేసినట్లు స్పష్టం చేసింది.

ఓటర్ల జాబితా సవరణ ఉత్తర్వూ ఎన్నికల సంఘం ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయమని కూడా ఈసీ స్పష్టం చేసింది. ‘‘ఫారం 6ను చట్టవిరుద్ధంగా, ఏకపక్షంగా మార్చారని’’ ఇప్పుడు నిజమైందని రాహుల్ గాంధీ ఎక్స్ లో ట్వీట్ చేశారు.
బీజేపీకి సాయం చేయడానికి సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తన పదవిని దుర్వినియోగం చేశారని చెప్పడానికి ఇదొక రుజువు అని ఆయన ఆరోపించారు. ‘‘మన ప్రజాస్వామ్యంపై జరిగిన నేరపూరిత దాడిలో కుమార్ తో పాటు ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ జవాబుదారీగా చేస్తాం’’ అని లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు అన్నారు. దీనితో ఈసీ స్పందించింది.
రాహుల్ గాంధీ చేసిన పోస్ట్ ను ట్యాగ్ చేసిన ఈసీ.. ఆయన ప్రకటన పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టించేది ఉందని పేర్కొంది. బీహార్ లో జరిగిన ఎస్ఐఆర్ ను ఈసీ ఏకగ్రీవ నిర్ణయంతో తీసుకున్నట్లు పేర్కొంది. ఈ ప్రక్రియ 2025, జూన్ 24న కమిషన్ తీసుకున్నట్లు వివరించింది. ఈ ఉత్తర్వును భారత సుప్రీంకోర్టు 2026, మే 27 నాడు ఇచ్చిన తీర్పులో సమర్థించిందని ఈసీ ఆ ఉత్తర్వును ప్రస్తావించింది.
‘‘ఎన్నికల సంఘం సెప్టెంబర్ 25, 2026 నాడు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పాయింట్ 1(3) లో సర్ కోసం ఫారం 6కు జతచేసిన ప్రకటనను గౌరవనీయ సుప్రీంకోర్టు సమర్థించింది’’ అని పేర్కొంది.
సర్ పరిధిలోకి రాని రాష్ట్రాల నుంచి ఓటర్లుగా నమోదు చేస్తున్న వారి తల్లిదండ్రుల వివరాలను కోరుతూ జారీ చేసిన ప్రకటనను కూడా ఈసీ విరమించుకున్నట్లు పేర్కొంది. కొత్తగా ఓటు హక్కు కోరేవారు ఫారం- 6 ద్వారా ఓటును పొందుతారు.
ఫారం 6 లో జరిగిన మార్పులకు సుప్రీంకోర్టు ఆమోదించిందనే ఈసీ వాదనను కోర్టు అంగీకరించలేదు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ వి. మోహన్ లతో కూడిన ధర్మానం ఈ మేరకు స్పష్టం చేసింది. రికార్డులు తమ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని ఎవరూ మార్చారో చూస్తామని పేర్కొన్నారు.
Read More
Next Story