‘రాహుల్ గాంధీని ఉరితీయాలి’
x
Rahul Gandhi

‘రాహుల్ గాంధీని ఉరితీయాలి’

‘‘నిరుద్యోగులకు 2లక్షల ఉద్యోగాలను ఇస్తామని ఎన్నికల సమయంలో హామీనిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పినందుకు(Rahul Gandhi) రాహుల్ గాంధీని అశోక్ నగర్ లో ఉరితీయాలి’’ అన్నారు.


ప్రస్తుతం తెలంగాణలో ‘ఉరి’ రాజకీయాలు నడుస్తున్నాయి. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఒకరిని ఉరితీయాలని అంటే ప్రధాన ప్రతిపక్షం (BRS)బీఆర్ఎస్ మరోనేతను ఉరితీయాలని డిమాండ్ చేస్తుంది. ఇంతకీ విషయం ఏమిటంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మాట్లాడుతు ‘‘నిరుద్యోగులకు 2లక్షల ఉద్యోగాలను ఇస్తామని ఎన్నికల సమయంలో హామీనిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పినందుకు(Rahul Gandhi) రాహుల్ గాంధీని అశోక్ నగర్ లో ఉరితీయాలి’’ అన్నారు. అలాగే ‘‘రైతులకు రు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పినందుకు వరంగల్ లో రాహుల్ గాంధీని ఉరితీయాలి’’ అని కామెంట్ చేశారు. రాహుల్ ను ఉరితీయాలన్న కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంఎల్ఏలు మండిపోతున్నారు.

రాహుల్ ను ఉరితీయాలని కేటీఆర్ ఎందుకు అన్నారు ? ఎందుకంటే నీటి ప్రాజెక్టుల్లో తెలంగాణకు అన్యాయం చేసినందుకు కేసీఆర్, హరీష్ రావును ఉరితీయాలని రేవంత్ అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీల నీటి హక్కులు చాలని కేసీఆర్ చేసిన సంతకమే ఇపుడు తెలంగాణ ప్రాజెక్టులకు శాపంగా మారిందని రేవంత్ అన్నారు. ఆ సందర్భంగానే రేవంత్ మాట్లాడుతు తెలంగాణకు కేసీఆర్, హరీష్ చేసిన అన్యాయాలకు ఇద్దరినీ ఉరితీయాలని అన్నారు. రేవంత్ ఉరి వ్యాఖ్యలకు దీటుగా కేటీఆర్ కూడా ఉరి వ్యాఖ్యలను చేశారు.

Read More
Next Story