‘రాహూల్ గాంధీ వయనాడు నుంచి కూడా పారిపోతాడు’
కంచుకోట అయినా కాంగ్రెస్ అమేథీని కోల్పోయిందని, రాహూల్ గాంధీ వయనాడ్ పారిపోయాడు, ఇప్పుడు అక్కడి నుంచి కూడా పారిపోతాడాని ప్రధాని మోదీ చెబుతున్నారు. వివరాలు
కాంగ్రెస్ అగ్రనేత రాహూల్ గాంధీ మరో సురక్షిత స్థానం కోసం పరుగులు పెడుతున్నారని ప్రధాని మోదీ అన్నారు. 2019 లో అమేఠీ నుంచి ఓడిపోయిన రాహూల్ గాంధీ, కేరళలోని వయనాడ్ నుంచి గెలుపొందారని, ఇప్పుడు వయనాడ్ లో ఓడిపోతారనే భయంతో మరో స్థానానికి పరుగులు పెడుతున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, మోదీ ఎవరి పేర్లను చెప్పకుండా పరోక్షంగా యువరాజు అంటూ సంబోధించారు. రాహుల్ గాంధీ కుటుంబ కంచుకోట అయిన అమేథీని కోల్పోయింది. ఇది ముందస్తుగా ఊహించిన యువరాజు వయనాడ్ నుంచి సైతం బరిలోకి దిగారు. 2024 ఎన్నికల్లో కూడా వయనాడ్ నుంచి రాహూల్ గాంధీ ఓడిపోతారని, మరొక స్థానం నుంచి కూడా ఆయన పోటీ చేసే అవకాశం ఉందని, అక్కడి నుంచి గెలుపొందవచ్చని సూచించారు.
“కాంగ్రెస్ యువరాజు ఉత్తరాది నుంచి పారిపోయి దక్షిణాదిన ఆశ్రయం పొందాడు. వాయనాడు ను కూడా విడిచి పెట్టబోతున్నాడు. తన పేరు మీద మరో సీటును ప్రకటిస్తారన వెల్లడించారు. ఏప్రిల్ 26న వాయనాడ్‌కు పోలింగ్ ముగిసిన వెంటనే ఆయనకు మరో స్థానంలో పోటీ చేస్తారు. ఆయన మరో సురక్షిత సీటు కోసం చూస్తున్నారు. నా మాటలు గుర్తు పెట్టుకోండి. ఇది జరుగుతుంది’’ అని మోదీ అన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ లోక్ సభ నుంచి రాజ్యసభకు మారడం పై స్పందించిన మోదీ, ఈ చర్య కాంగ్రెస్ ముందుగానే ఓటమిని అంగీకరించిందని అన్నారు.
“పెద్ద నాయకులు (కాంగ్రెస్) ఇకపై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోరని, వారు రాజ్యసభకు వెళతారని నేను ఒకసారి పార్లమెంటులో ప్రకటించాను. నేను ఇలా చెప్పిన ఒక నెల తర్వాత, వారి పెద్ద నాయకులు లోక్‌సభ నుంచి నిష్క్రమించవలసి వచ్చింది...కాబట్టి పార్టీ ఓటమి ఇప్పటికే అంగీకరించింది. కాబట్టి, ఈసారి నేను పూర్తిగా నమ్మకంగా ఉన్నాను.(రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభ ఎంపీగా ఉన్న సోనియా ఇటీవల రాజ్యసభకు వెళ్లారు) అయితే కీలక స్థానాలైన అమేథీ, రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసే అభ్యర్థులపై కాంగ్రెస్ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు.
E D సామర్థ్యం 2014 తర్వాత పెరిగింది'
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని ప్రశంసిస్తూ 2014లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏజెన్సీ సామర్థ్యం చాలా రెట్లు పెరిగిందని మోదీ అన్నారు. 2014కి ముందు మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎమ్‌ఎల్‌ఎ) కింద ఇడి 1,800 కంటే తక్కువ కేసులను నమోదు చేసిందని, ఎన్‌డిఎ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 5,000 కేసులకి పెరిగిందని మోదీ చెప్పారు.
ఈడీ దాడులు కూడా 2014 తర్వాత 84 నుంచి 7,000కి పెరిగాయని ఆయన చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి ఈ డీ ని ఉపయోగించుకుంటారని అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ED దాఖలు చేసిన అవినీతి కేసుల్లో కేవలం మూడు శాతం మాత్రమే రాజకీయ నాయకులపై ఉన్నాయని మోదీ అన్నారు
ఈ విషయాన్ని ఆయన ఇటీవల వార్తా సంస్థ ANI కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. “అవినీతిపై చర్య తీసుకోవడానికి ఒక సంస్థను స్థాపించినట్లయితే, అది తన పనిని చేయకపోతే ప్రశ్నలు అడగాలి. అది తన పని తాను చేసుకుంటుంది కాబట్టి ప్రశ్నలు అడగడం సమంజసం కాదు'' అని అన్నారు.
'2024 లోక్‌సభ ఎన్నికలు కీలకం'
మూడు దశాబ్దాల అస్థిర ప్రభుత్వాల తర్వాత దేశంలో సంపూర్ణ మెజారిటీతో స్థిర ప్రభుత్వాలు ఏర్పాటు అయ్యాయి. దీని ఫలితాలు అనుభవిస్తున్నారని 2024 లోక్ సభ ఎన్నికలు సంక్షిష్టమైనవని మోదీ అన్నారు. ఇప్పుడు పోటీ చేసేది బీజేపీనో.. మోదీనో కావని ప్రజలు పోటీ చేస్తున్నారని అన్నారు.
2014లో ప్రధాని అయిన అనుభవం గురించి మాట్లాడుతూ, “ప్రజలు నాపై ఆశలు పెట్టుకున్నారు, దేశ ప్రజల ఆశలను నెరవేర్చాలనే ఆశలు నాకు ఉన్నాయి. నేను పాలించను, సేవ చేస్తాను. నాకు ప్రభుత్వాన్ని నడపడం అంటే ప్రభుత్వాన్ని నడుపుతూ నా పదవిని ఆస్వాదించడం కాదు.
ప్రజలు ఇప్పుడు తన ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాలతో పోల్చి చూస్తున్నారని, కేంద్రంలో మరో పర్యాయం అధికారంలోకి రావాలని ప్రజలు నిర్ణయించుకున్నారని ప్రధాని పునరుద్ఘాటించారు. 2014లో భారత ప్రజలకు ఆశలు తీసుకొచ్చామని, 2019లో ఆత్మవిశ్వాసాన్ని నింపామని, 2024లో ‘మోదీ కి గ్యారెంటీ’ని భారత ప్రజలకు అందజేస్తామని ప్రతిజ్ఞ చేశాం.
క్రిస్టియన్ ఔట్రీచ్
బిజెపిపై క్రైస్తవ సమాజం విశ్వాసం మరింత బలపడిందని, వారి సంక్షేమం కోసం పార్టీ చేయగలిగినదంతా కొనసాగిస్తుందని మోదీ అన్నారు. కేరళలో ఎల్‌డిఎఫ్, యుడిఎఫ్‌లను లక్ష్యంగా చేసుకున్న మోదీ, రాష్ట్రంలోని క్రైస్తవులు "అబద్ధాల పొత్తులతో" విసిగిపోయారని, బిజెపిపై వారి నమ్మకం మరింత బలపడిందని అన్నారు.
గోవా, ఈశాన్య రాష్ట్రాలతో సహా చాలా చోట్ల క్రైస్తవ సభ్యులు బీజేపీకి మద్దతు ఇస్తున్నారని మోదీ చెప్పారు. గోవాలో క్రైస్తవులు అధిక సంఖ్యలో ఉన్నారని, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో అధిక సంఖ్యాకులుగా ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా మోదీ పేర్కొన్నారు.
ఈశాన్య ప్రాంతంలోని చాలా రాష్ట్రాల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్నాయి. అనేకమంది ముఖ్యమంత్రులు, మంత్రులు క్రైస్తవులని, తాను తరచూ ఈసంఘంలోని నాయకులను కలుస్తుంటానని, క్రిస్మస్ ఉత్సవాలను కూడా నిర్వహిస్తున్నానని ప్రధాని చెప్పారు.
ఎల్‌డిఎఫ్ - యుడిఎఫ్ కారణంగా రాష్ట్రంలోని చర్చి ఆస్తులు ఎలా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయో కేరళకు చెందిన కమ్యూనిటీ నాయకులు తనకు చెప్పారని, మత్స్యకారులతో సహా వారికి సహాయం చేయడానికి తన ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను హైలైట్ చేశారు.
క్రైస్తవ సమాజానికి మాపై నమ్మకం పెరిగిందని, వారి సంక్షేమం కోసం అన్ని విధాలా కృషి చేస్తామని ఆయన అన్నారు. "రెండు పార్టీలు ఒకే నాణానికి రెండు ముఖాలు" అని మోదీ అన్నారు, వామపక్ష నాయకులను జైలులో పెట్టాలని కేరళలో కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందని, అయితే వారిని అరెస్టు చేస్తే "ప్రతీకార" రాజకీయాలని మాట మారుస్తుందని అన్నారు. లెప్ట్ పార్టీలు నిర్వహిస్తున్న సహకార బ్యాంకులో పెద్ద కుంభకోణం జరిగిందని అన్నారు.
Next Story