రాజ్యసభ అభ్యర్థులుగా జేపీ నడ్డా, అశోక్‌ చవాన్‌
x

రాజ్యసభ అభ్యర్థులుగా జేపీ నడ్డా, అశోక్‌ చవాన్‌

జేపీ నడ్డా గుజరాత్‌ నుంచి రాజ్యసభకు పోటీ చేయనున్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌ను తన సొంత రాష్ట్రం మహారాష్ట్ర నుంచి బరిలోకి దింపింది బీజేపీ.


బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గుజరాత్‌ నుంచి రాజ్యసభకు పోటీ చేయనున్నారు.అలాగే మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌ను తన సొంత రాష్ట్రం మహారాష్ట్ర నుంచి బరిలోకి దింపింది బీజేపీ. కాంగ్రెస్‌ను వీడిన ఒకరోజు తర్వాత మంగళవారం చవాన్‌ బీజేపీలో చేరారు.

రాజ్యసభ ఎన్నికల కోసం బీజేపీ విడుదల చేసిన జాబితాలో నలుగురు అభ్యర్థులు ఉన్నారు. గుజరాత్‌ నుంచి ఒకరు కాగా మహారాష్ట్ర నుంచి ముగ్గురు ఉన్నారు.

నడ్డా ప్రస్తుతం హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అయితే కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రం నుంచి గెలిచే అవకాశం లేకపోవడంతో గుజరాత్‌ నుంచి ఆయనను బరిలోకి దింపింది కమలం పార్టీ.

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్‌ చవాన్‌ మంగళవారం బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. బీజేపీలో అశోక్‌ చవాన్‌ చేరికను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ స్వాగతించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చవాన్‌ బీజేపీలో చేరడం హర్షణీయమని పేర్కొన్నారు.

చవాన్‌ గతంలో రెండుసార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా, పనిచేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేయాలన్న కోరికతోనే తాను బిజెపిలో చేరినట్లు చవాన్‌ తెలిపారు. చవాన్‌ రాకతో మహారాష్ట్ర, మరాఠ్వాడలో బిజెపి మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

గుజరాత్‌కు చెందిన కేంద్ర మంత్రులు, రాజ్యసభ సభ్యులు మన్సుఖ్‌ మాండవియా, పర్షోత్తమ్‌ రూపాలా, మహారాష్ట్రకు చెందిన నారాయణ్‌ రాణేను రీ నామినెట్‌ చేయలేదు. దీంతో వారు లోక్‌సభకు పోటీచేసే అవకాశం ఉంది.

ఏప్రిల్‌లో ముగియనున్న పదవీకాలం..

15 రాష్ట్రాలకు చెందిన మొత్తం 56 మంది రాజ్యసభ సభ్యులు ఏప్రిల్‌లో పదవీ విరమణ చేయనున్నారు. ఫిబ్రవరి 27న ఆ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఫిబ్రవరి 15.

Read More
Next Story