కోల్‌కతా నుంచి బెంగళూరుకు రామేశ్వరం కేఫ్ నిందితులు..
x

కోల్‌కతా నుంచి బెంగళూరుకు రామేశ్వరం కేఫ్ నిందితులు..

ఎట్టకేలకు బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో పేలుళ్లకు పాల్పడిన నిందితులు దొరికారు. కోల్‌కతాలో పట్టుబడిని ఇద్దరు నిందితులను కోర్టు అనుమతితో బెంగళూరుకు తీసుకువచ్చారు.


రామేశ్వరం కేఫ్‌ పేలుళ్ల కేసులో ఇద్దరు ప్రధాన నిందితులను ట్రాన్సిట్‌ రిమాండ్‌పై కోల్‌కతా నుంచి బెంగళూరుకు తీసుకొచ్చారు.

ఇద్దరిని సాధారణ వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లి, ఆ తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కోర్టులో హాజరుపరచనున్నారు.

కోల్‌కతాలోని ఒక కోర్టు శుక్రవారం ఇద్దరు నిందితులకు 3 రోజుల ట్రాన్సిట్ రిమాండ్‌ను మంజూరు చేస్తూ.. వారిని కర్ణాటక రాజధానికి తీసుకెళ్లడానికి NIAకి అనుమతినిచ్చింది.

రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడులో 10 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ కేసులో కోల్‌కతాకు చెందిన ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్, అద్బుల్ మతీన్ అహ్మద్ తాహాలను NIA అరెస్టు చేసింది.

NIA ప్రకారం..షాజిబ్ కేఫ్‌లో పేలుడుకు ఉపయోగించే ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED)ని ఉంచాడు. తాహా ప్రధాన సూత్రధారిగా నిర్ధారించారు. ఈ ఇద్దరు నిందితుల అరెస్టుకు సంబంధించి సమాచారం అందించిన వారికి ఎన్‌ఐఏ మార్చిలో ఒక్కొక్కరికి రూ.10 లక్షల రివార్డును ప్రకటించింది. బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్‌లోని ఐటీపీఎల్ రోడ్‌లో ఉన్న కేఫ్‌లో మార్చి 1న పేలుడు సంభవించగా..3న విచారణ చేపట్టింది.

Read More
Next Story