అయోధ్యలో విగ్రహ ప్రతిష్ఠ గురించి ఆధ్యాత్మిక వేత్త రవిశంకర్‌ ఏమన్నారు?
x

అయోధ్యలో విగ్రహ ప్రతిష్ఠ గురించి ఆధ్యాత్మిక వేత్త రవిశంకర్‌ ఏమన్నారు?

అయోధ్య రామాలయం చుట్టూనే ప్రస్తుతం రాజకీయాలు నడుస్తున్నాయి. కొందరు విగ్రహ ప్రతిష్ఠ శాస్త్ర విరుద్ధమంటే..మరి రవిశంకర్‌ ఏమంటున్నారు..


నిర్మాణంలో ఉన్న అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠ శాస్త్ర విరుద్ధమని జ్యోతిష్మత్‌ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలను ఉటంకిస్తూ ప్రతిపక్ష పార్టీలు బీజేపీపై విమర్శలను ఎక్కుపెట్టాయి. ఈ నేపథ్యంలో ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఆధ్యాత్మిక వేత్త రవిశంకర్‌ ‘ప్రాణ ప్రతిష్ఠ’ తర్వాత ఆలయాలను నిర్మించిన సందర్భాలను ఉదహరించారు.

‘‘తమిళనాడులోని రామేశ్వరంలో రాముడు స్వయంగా శివలింగానికి ప్రాణ ప్రతిష్ట చేశాడు. అప్పట్లో గుడి లేదు. అతనికి గుడి కట్టడానికి సమయం లేదు. అతను ప్రాణ ప్రతిష్ట చేసాడు తరువాత ఆలయాన్ని నిర్మించారు’’ అని రవిశంకర్‌ వివరించారు.

‘‘మదురై దేవాలయం, తిరుపతి బాలాజీ దేవాలయం కూడా మొదట్లో చిన్నవేనని, ఆ తర్వాత రాజులు వీటిని నిర్మించారు’’ అని అన్నారు.

అయోధ్యలో దేవాలయం ఆవశ్యకతను సమర్థిస్తూ.. 500 ఏళ్ల క్రితం జరిగిన తప్పును ఇది సరిదిద్దుతోందని రవిశంకర్‌ అన్నారు.

‘‘500 ఏళ్ల క్రితం జరిగిన తప్పును సరిదిద్దుతున్నారు. ఐదు శతాబ్దాలుగా ప్రజలు దీనికోసమే ఎదురు చూశారు. గొప్ప కల నిజం కాబోతుంది. దేశం మొత్తానికి ఇదొక గొప్ప వేడుక.’’అని పేర్కొన్నారు.

సంపన్నంగా ఉన్న సమాజాలు సంతోషంగా లేవని, అలాగే సంతోషంగా ఉన్న సమాజాలు సంపన్నంగా లేవని చెబుతూ రాముడు ఆనందం, శ్రేయస్సు రెండూ ఉన్న సమాజ స్థాపనకు కృషి చేశాడని చెప్పుకొచ్చారు.

రాముడి జీవితం గురించి మాట్లాడుతూ..‘‘రాజుగా ఉన్నందున, అతను అడవిలో మత్స్యకారుడిని, పడవ నడిపేవారిని, గిరిజన మహిళ శబరిని కౌగిలించుకోవడం భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచిస్తుందని వివరించారు రవిశంకర్‌.

Read More
Next Story