బీసీ డిక్లరేషన్‌ సభలో రెడ్‌బుక్‌ మంటలు!

రెడ్‌బుక్‌లో ఉన్న వారు ఎవ్వరూ రెండు నెలల తరువాత తప్పించుకోలేరు. మంగళగిరిలో గెలిచి చూపిస్తా.


బీసీ డిక్లరేషన్‌ సభలో రెడ్‌బుక్‌ మంటలు!
x
నారా లోకేశ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి

రెడ్‌బుక్‌ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే కోర్టులో రెడ్‌బుక్‌ మాటలపై నమోదైన కేసులో విచారణ జరుగుతోంది. బీసీ డిక్లరేషన్‌ సభలో మరోసారి రెడ్‌బుక్‌ మాటలు మార్మోగాయి. రెడ్‌బుక్‌ మాట రాగానే జనం హోరెత్తించారు.

తప్పుడు అధికారులు ఎవ్వరూ రెడ్‌బుక్‌ నుంచి తప్పించుకోలేరు. నేను మంగళగిరి నుంచి 50వేల పైన మెజారిటీతో గెలిచి చూపిస్తా. అడుగడుగునా ఇబ్బందులు పెడుతున్న వైఎస్సార్‌సీపీ వారిని వదిలిపెట్టేది లేదు. బీసీలకు వైఎస్సార్‌సీపీ ఏమీ చేయలేదు. రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరాం తెలుగుదేశం పార్టీలో చేరారు. వైఎస్సార్‌సీపీకి కర్నూలు బీసీ ఎంపీ సంజీవకుమార్, మాజీ మత్రి, ఎమ్మెల్యే పార్థసారధి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిలు వైఎస్సార్‌సీపీకి ఎందుకు దూరమయ్యారు.
బీసీల సాధికారత అంటే ఇదేనా? బీసీలను అణదొక్కిన పార్టీ వైఎస్సార్‌సీపీ, చంద్రబాబునాయుడు నాయకత్వంలో ముందడుగు వేస్తాం. బీసీ సాధికారత స్థాపిస్తాం అని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఉన్న ప్రాంగణంలో మంగళవారం ఏర్పాటు చేసిన బీసీ జనసభలో పాల్గొని మాట్లాడారు.
బీసీ డిక్లరేషన్‌ విడుదల చేసే కార్యక్రమంలో సాయంత్రం ఆరున్నర గంటలకు లోకేష్‌ మాట్లాడారు. బీసీలకు ఏమి చేయనున్నారో చంద్రబాబు బీసీ డిక్లరేషన్‌ ద్వారా తెలియజేస్తారన్నారు. బీసీ డిక్లరేషన్‌ సభ లక్షల మందితో జరిగింది. సుమారు వందమందిపైన వేదికపై పాల్గొన్నారు. టీడీపీ నేత చంద్రబాబునాయుడతో పాటు జనసేన పార్టీ నేత కె పవన్‌కళ్యాణ్‌ పాల్గొన్నారు.
Next Story