Telangana High Court
x

గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు సంచలన తీర్పు

గ్రూప్-1 నియామకాలపై సింగిల్ జడ్జి తీర్పును తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం రద్దు చేసింది.


గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు కీలక ఊరట లభించింది. నియామకాలపై తాజా పరిణామంగా తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం తీర్పు వెలువరించింది. గ్రూప్-1 నియామకాలపై గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సీజే ధర్మాసనం రద్దు చేసింది. జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో మెయిన్స్ జవాబు పత్రాలను మళ్లీ మూల్యాంకనం చేయాలని కూడా ఆదేశించారు.

ఆ ఆదేశాలపై టీజీపీఎస్సీ అప్పీల్‌కు వెళ్లింది. ఎంపికైన అభ్యర్థులు కూడా అదే తీర్పును సవాల్ చేస్తూ అప్పీలు దాఖలు చేశారు. ఈ అప్పీలపై సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ పూర్తైన అనంతరం నేడు తుది తీర్పు వెలువడింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను ధర్మాసనం రద్దు చేసింది. దీంతో గ్రూప్-1 నియామకాల విషయంలో ఎంపికైన అభ్యర్థులకు ఊరట లభించింది. తాజా తీర్పుతో నియామకాలపై ఉన్న న్యాయసంబంధ అనిశ్చితి తొలగినట్లు భావిస్తున్నారు. తదుపరి చర్యలు న్యాయపరమైన మార్గదర్శకాల ప్రకారం కొనసాగనున్నాయి.

అసలు వివాదం ఇది

2024 అక్టోబర్ మూడో వారం లో జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకనం సరిగ్గా జరగలేదని, ఇందులో చాలా అవకతవకలు జరిగాయని, దీని మీద న్యాయ విచారణ జరిపించాలని పలువురు విద్యార్థులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. దీని మీద హైకోర్టు సింగిల్ జడ్జి విచారణ జరిగింది. 2025 మార్చి 10 వ తేదీన కమిషన్ విడుదలచేసిన తుది మార్కుల జాబితా ను అనుసరించి మార్చి 30న ప్రకటించిన ర్యాంకింగ్ జాబితాను ఏకసభ్యధర్మాసనం కొట్టి వేసింది. గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ షీట్లను మళ్లీ మూల్యాంకనం చేసి ఫలితాలు తాజాగా ప్రకటించాలని ఈ ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. అంతేకాదు, ఇలా వీలు కాని పక్షంలో మెయిన్స్ తిరిగి నిర్వహించాలని కూడా ధర్మాసనం చెప్పింది.

అయితే, ఏక సభ్య ధర్మాసనం తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో మొదటి ర్యాంకింగ్ తో ఎంపికయిన అనేక మంది అభ్యర్థులు కూడా పిటిషన్ వేశారు. వీటిని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణకు స్వీకరించింది. అనేక మలుపులు తిరిగిన గ్రూప్‌-1 మెయిన్స్‌ ఎగ్జామ్‌ అధారంగా ఇప్పటికే నియామకాలు పూర్తి అయ్యాయి. 562 మందికి సర్కార్‌ నియామక పత్రాలు కూడా కమిషన్ అందజేసింది. డివిజన్ బెంచ్ ఫిబ్రవరి 5 న ఇవ్వనున్న తీర్పు మీద నియామక పత్రాలు అందుకున్న 562 మంది భవితవ్యం అధారపడి ఉంది.

Read More
Next Story