చంద్రబాబు ‘రెడ్ బుక్’ ఫాలో అవుతున్న రేవంత్
x

చంద్రబాబు ‘రెడ్ బుక్’ ఫాలో అవుతున్న రేవంత్

చట్టాన్ని గౌరవించాని సీనియర్ అధికార్లకు మాజీ ఐపిఎస్ ప్రవీణ్ కుమార్ విజ్జప్తి


తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు నాయుడు రెడ్ బుక్ ఫాలో అవుతున్నాడని మాజీ ఐపిఎస్ అధికారి, బిఆర్ ఎస్ నాయకుడు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.

మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో వేధిస్తున్నారని చెబుతూ అధికారులు చట్టాన్ని గౌరవించాలని కాని , ముఖ్యమంత్రి కార్యాలయంలోఉన్న వారి సంతృప్తి పరిచేందుకు పనిచేయరాదని ఆయన చెప్పారు. ఇలా చేయడం ఆంధ్రప్రదేశ్ లోని చంద్రబ ాబు ప్రభుత్వంలో జరుగుతూ ఉందని ప్రవీణ్ కుమార్ చెప్పారు.

" చంద్రబాబు నాయుడు 16 మంది అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా ఆరు నెలల పాటు ఘోరంగా అవమానించాడు. ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను జైలుకు పంపాడు. ఇదేమని అడిగే వాళ్ల పేర్లు మా రెడ్ బుక్ లో ఉన్నాయంటున్నాడు. అదే దారిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తున్నది, "అని ఆయన అన్నారు. విచారణ పేరుతో అధికారుల కుటుంబ సభ్యులనుకూడా వేధిస్తున్నారని, గంటలతరబడి పోలీస్ స్టేషన్లలో వేచి ఉండేలా చేస్తున్నారని, కుటుంబ సభ్యలు వేధించడం సబబు కాదు. ప్రభాకర్ రావు కుటుంబసభ్యులను తెచ్చి పోలీస్ స్టేషన్‌లలో గంటలు గంటలు కూర్చోబెట్టి విచారిస్తే వాళ్లకేం తెలుస్తుంది ఆయన అన్నారు.

"అధికారులకు ఒకప్పటి సహచరుడిగా చెప్తున్నా.. మీకు చేతులు జోడించి చెబుతున్నా.దయచేసి చట్టాన్ని గౌరవించండి. ఎవరి మెప్పుకోసమో, ముఖ్యమంత్రి గారి మెప్పుకోసమో, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండే స్వార్థపరులు, కబ్జా దారులకోసం ఆయన మీ సహచరుడు ప్రభాకర్ రావును, ఆయన కుటుంబసభ్యులను ఇబ్బందులు పెట్టకండి,"అని ఆయన విజ్ఞప్తి చేశారు.

గతంలో పంజాబ్ రాష్ట్రంలో టెర్రరిజం బలంగా ఉన్న రోజుల్లో ఎంతో గొప్పగా పనిచేసిన అధికారుల మీద ట్రిబ్యునల్ వేసి సతాయించినందువల్ల, టార్చర్ చేసినందు వల్ల టెర్రరిస్టులు అని ముద్ర వేసి ఇబ్బందులు పెడితే, వాళ్ళు అవమానం తట్టుకోలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. అదే రీతిలో ఇపుడు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును వేధిస్తున్నారు. పరిస్థితులు తెలంగాణలో తీసుకురావొద్దు," అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు.



Read More
Next Story