కేరళలో రేవంత్ రెడ్డి రెండు రోజుల పర్యటన
x

కేరళలో రేవంత్ రెడ్డి రెండు రోజుల పర్యటన

కేరళలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో త్రివేండ్రం, అలప్పుజ, ఎర్నాకుళంలో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ నిర్వహణ.


కేరళలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల ఎన్నికల ప్రచార పర్యటన నేడు ప్రారంభమైంది. త్రివేండ్రం, అలప్పుజ, ఎర్నాకుళం ప్రాంతాల్లో వరుస కార్యక్రమాలతో ఆయన బిజీ షెడ్యూల్ కొనసాగుతోంది. ఉదయం 9.30 గంటలకు త్రివేండ్రంలోని ఎస్‌ఎం లాక్ జంక్షన్ నుంచి ముట్టతార వరకు జరిగే రోడ్ షోలో సీఎం పాల్గొననున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు భారతన్నూర్‌లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.

మధ్యాహ్నం 12 గంటలకు కట్టక్కడ నుంచి పూవాచల్, వెల్లండ్ వరకు జరిగే మరో రోడ్ షోలో ఆయన పాల్గొననున్నట్లు సమాచారం. సాయంత్రం 4 గంటలకు అలప్పుజలో నిర్వహించే కార్నర్ మీటింగ్‌లో సీఎం హాజరై ప్రచారం కొనసాగించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన ఎర్నాకుళం చేరుకోనున్నారు. రేపు కూడా కేరళలోనే ఆయన ప్రచార కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఈ పర్యటనతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.

Read More
Next Story