
అసెంబ్లీ నుంచి కేసీఆర్ వెళ్లడంపై రేవంత్ ఏమన్నారంటే !
కేసీఆర్‌తో ఏం మాట్లాడారో చెప్పిన రేవంత్.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ హాజరయ్యారు. అయితే ఐదు నిమిషాల్లోనే ఆయన వెళ్లిపోయారు కూడా. సమావేశాలు వాయిదా పడిన తర్వాత ఇదే అంశంపై సీఎం రేవంత్ స్పందించారు. కేసీఆర్ ఎందుకు వెళ్లిపోయారంటూ మీడియా అడగడంతో రేవంత్ మాట్లాడారు. ఆయన ఎందుకు వెళ్లిపోయారో తనకెలా తెలుస్తుందన్నారు. ఆ ప్రశ్నకు సమాధానం ఆయననే అడగాలని చెప్పారు. “కేసీఆర్‌తో నేను ఏం మాట్లాడానో మీకు చెబుతాను” అని పేర్కొన్నారు.
అసెంబ్లీలో చేరగానే కేసీఆర్ 5 నిమిషాల్లోనే ఎందుకు వెళ్లిపోయారో ఆయన్నే అడగాలని రేవంత్ రెడ్డి సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీ లాబీని పార్లమెంట్ సెంట్రల్ హాల్ మాదిరిగా తీర్చిదిద్దాలని, మాజీ ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులకు ప్రత్యేక యాక్సెస్ కల్పిస్తారని చెప్పారు. బడ్జెట్ సమావేశాల వరకు మండలి పూర్తి చేయాలని కూడా పేర్కొన్నారు.
చిట్‌చాట్ అనంతరం సీఎం మంత్రులు, ప్రభుత్వ విప్‌లతో భేటీ అయ్యారు. అసెంబ్లీ స్ట్రాటజీ, ప్రతిపక్షానికి కౌంటర్ వ్యూహాలపై చర్చ జరిగింది. జనవరి 4 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. ఇక స్పీకర్ ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన బీఏసీ సమావేశం ప్రారంభమైంది. దీనిలో మంత్రులు భట్టి విక్రమార్క్, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, భాజపా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పాల్గొన్నారు. సమావేశంలో అసెంబ్లీ పని దినాలు, అజెండా ఖరారు చేయనున్నారు.

