చేనేత  జిఎస్టి మీద రాహుల్ గాంధీ ఇచ్చిన  హామీ ఏమయింది?
x

చేనేత జిఎస్టి మీద రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ఏమయింది?

ఏబీపీఎస్‌ ‌రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో చేసిన తీర్మానాలేంటి? ఇంకా ఏ డిమాండ్లు ప్రభుత్వం ముందుంచబోతున్నారు.


భారత్‌ ‌జోడోయాత్ర సందర్భంగా కాంగ్రెస్‌ ‌మాజీ అధ్యక్షుడు రాహుల్‌ ‌గాంధీ ఇచ్చిన హామీ మేరకు చేనేతపై 5 శాతం జీఎస్టీ పరిహారం ఇవ్వాలని పద్మశాలి రౌండ్ టేబుల్ డిమాండ్ చేసింది.

చేనేత రంగం మీద 5 శాతం జిఎస్ టి రద్దు చేయడం సాధ్యం కానపుడు దానిని రిఎంబర్స్ చేసేందుకు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం

జీరో జీఎస్టీ ఉద్యమ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా అఖిల భారత పద్మశాలి సంఘం (ఏబీపీఎస్‌) ‌చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న నేత అధ్యక్షతన శనివారం (జనవరి 5) నారాయణగూడలోని పద్మశాలీ భవన్‌లో రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ విప్‌ ఈరవత్రి అనిల్‌ ‌కుమార్‌, ‌టెక్స్‌టైల్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌కార్పొరేషన్‌ ‌మాజీ చైర్మన్‌ ‌గూడూరు ప్రవీణ్‌, ఏబీపీఎస్‌ ‌జాతీయ అధ్యక్షుడు కందగట్ల స్వామి, గౌరవాధ్యక్షుడు శ్రీధర్‌ ‌సుంకుర్వర్‌, ‌ప్రధాన కార్యదర్శులు గడ్డం జగన్నాథం, వనం విశ్వనాథం, నటి, సామాజిక కార్యకర్త పూనమ్‌ ‌కౌర్‌, ‌తెలంగాణ ప్రాంత పద్మశాలీ సంఘం అధ్యక్షుడు మచ్చ ప్రభాకర్‌ ‌రావు, ఏబీపీఎస్‌ ‌మహిళా విభాగం అధ్యక్షురాలు వనం దుష్యంతల, ఇంజనీరింగ్‌ ‌విభాగం అధ్యక్షుడు పుట్టా పాండురంగయ్య, రాజకీయ విభాగం అధ్యక్షుడు బొల్లా శివశంకర్‌, ‌మీడియా విభాగం అధ్యక్షుడు అవ్వారు భాస్కర్‌, ‌పోపా అధ్యక్షుడు కుంటాల తిలక్‌, ‌గ్రంథాలయ పరిషత్‌ ‌మాజీ చైర్మన్‌ ‌జెల్లా మార్కండేయులు, కూరపాటి రమేష్‌ ‌ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా చేనేత సహకార సంఘాల అధ్యక్షుడు కందగట్ల బిక్షపతి, మాజీ అప్కో డైరెక్టర్లు గట్టు వీరన్న, మంత్రి బాబు, గర్దాస్‌ ‌బాలయ్య, బొమ్మ అమరేందర్‌, ‌చిక్కా దేవదాసు, పున్నా గణేష్‌, ‌బొమ్మ రఘురాం, రామునేత, దుస్సా యాదగిరి, గడ్డం లక్ష్మీనారాయణ, గుర్రం శ్రావణ్‌ ‌గడ్డం జయశంకర్‌, ‌పాశికంటి లక్ష్మీనారాయణ, అరుణ పొట్టబట్టిని, కల్లేపల్లి తిరుమల, గుంటక రూపా సదాశివ్‌, ‌ప్రవల్లిక, బాసాని పద్మ, బండారు లక్ష్మి, సంతోషిని, భువన సమావేశానికి హాజరయిన వారిలో ఉన్నారు.

సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు..

1.భారత్‌ ‌జోడోయాత్ర సందర్భంగా కాంగ్రెస్‌ ‌మాజీ అధ్యక్షుడు రాహుల్‌ ‌గాంధీ ఇచ్చిన హామీ మేరకు చేనేతపై 5 శాతం జీఎస్టీ పరిహారం ఇవ్వాలి.

2. చేనేతకు రూ. వెయ్యి కోట్ల బడ్జెట్‌ ‌కేటాయించాలి.

3. గత ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తూ చేనేత పాలసీని ప్రకటించాలి.

4. ఈరవత్రి అనిల్‌ ‌కుమార్‌కు ఎమ్మెల్సీ పదవి కేటాయించాలి.

5. అర్హులైన పద్మశాలీలకు నామినేటెడ్‌ ‌పోస్టులు ఇవ్వాలి.

6. చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి.

7. చేనేత సహకార సంఘాల బకాయిలు వెంటనే చెల్లించాలి.

8. టెస్కో పాలకమండలిని నియమించాలి.

9. తెలంగాణ హ్యాండ్లూమ్‌, ‌డెవలప్మెంట్‌ ‌కార్పొరేషన్‌కు నిధులు కేటాయించడంతో పాటు కార్పొరేషన్‌ ‌ద్వారా చేనేత కళాకారులకు ఉపాధి కల్పించాలి.

10. చేనేత బీమా వయోపరిమితిని 80 ఏళ్లకు పెంచాలి.

11. చేనేత రుణాలను మాఫీ చేయాలి

12. అంతర్జాతీయ స్థాయిలో చేనేత వస్త్రాలకు మార్కెటింగ్‌ ‌సౌకర్యం కల్పించాలి.

13. చేనేత సహకార సంఘాలకు క్యాష్‌ ‌క్రెడిట్‌ ‌పరిమితిని పెంచాలి.

Read More
Next Story