క్యాన్సర్ కు వ్యాక్సిన్ వచ్చింది....
x
photo source: rt.com

క్యాన్సర్ కు వ్యాక్సిన్ వచ్చింది....

క్యాన్సర్ గడ్డలను కరిగించే వ్యాక్సిన్ తయారు చేయడంలో రష్యా శాస్త్రవేత్తలు విజయవంతం


రష్యా క్యాన్సర్ కు వ్యాక్సి న్ కనిపెట్టింది. క్యాన్సర్ కు మందుకనిపెట్టేందుకు ప్రపంచ శాస్త్రవేత్తలంతా పరుగుపెడుతున్నారు. ఇలాంటపుడు రష్యానుంచి ఈ వార్త వెలువడింది. ఈ కొత్త వ్యాక్సిన్ ప్రిక్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తయ్యాయి. ఇందులో ఈ మందు రోగుల మీద 80 శాతం దాకా విజయవంతమయింది.అంతేకాదు, రోగుల జీవితకాలం పెరిగినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. Sputnik V Covid-19 వ్యాక్సిన్ తయారు చేసిన సంస్థయే ఇపుడు క్యాన్సర్ వ్యాక్సిన్ ను తయారు చేసింది. అదే mRNA technology ని ఉపయోగించినట్లు ఈ శాస్త్రవేత్తలు తెలిపారు.

కొత్తగా అభివృద్ధి చేసిన క్యాన్సర్ వ్యాక్సిన్ ప్రీక్లినికల్ ట్రయల్స్‌లో బాగా పనిచేసిందని, ఇపుడు మార్కెట్లోకి విడుదలకు సిద్ధంగా ఉందని ఫెడరల్ మెడికల్-బయోలాజికల్ ఏజెన్సీ అధిపతి వెరోనికా స్క్వోర్ట్సోవా (Veronika Skvortsova) తెలిపారు. ఇది మార్కెట్లోకి ప్రవేశించేందుకు ఇపుడు రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం ఎదురు చూస్తూ ఉంది.

మూడు సంవత్సరాల ప్రీక్లినికల్ ట్రయల్స్‌లో ఈ టీకా అద్భుతమైన ఫలితాలను చూపించిందని శుక్రవారం వ్లాడివోస్టాక్‌లో ఈ అధికారి చెప్పారు.

"[ట్రయల్స్] ఈ టీకా సురక్షితమని కూడా నిరూపించాయి. దానిని పదేపదే వాడవచ్చు. ఈ వ్యాక్సిన్ కు ఉన్న అధిక సామర్థ్యాన్ని కూడా నిరూపించాయ. ఇది క్యాన్సర్ కణితి పరిమాణాన్ని తగ్గించడం, కణితి పెరుగుదలని అరికట్టడం చేసింది.” అని స్క్వోర్ట్సోవా చెప్పారు. కొన్ని క్యాన్సర్లలో ఈ వాక్సిన్ 60-80% దాకా ప్రతిభావంతంతా పనిచేసిందని ఆమె తెలిపారు.

"క్లినికల్ ఉపయోగం కోసం అనుమతి పొందడానికి మేము ఆరోగ్య మంత్రిత్వ శాఖకు పత్రాలను సమర్పించాము" అని ఆ అధికారి తెలిపారు.

ఈ వ్యాక్సిన్ ని డెవెలప్ చేసింది కూడా గతంలో కోవిడ్ వ్యాక్సిన్ ను తయారు చేసి గమలేయ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ (Gamaleya Research Institute of Epidemiology and Microbiology) సంస్థయే. ఈ ఔషధం mRNA- ఆధార వ్యాక్సిన్, ఇది క్యాన్సర్ కణాలపై దాడి చేయడమెలాగో రోగి రోగనిరోధక వ్యవస్థకు శిక్షణ ఇస్తుంది. దానికి AI ని ఉపయోగిస్తుంది.

ఈ సంస్థ అతి తక్కువ కాలంలో స్పుత్నిక్ V కోవిడ్-19 వ్యాక్సిన్‌ను తయారు చేసి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం అదే mRNA టెక్నాలజీని ఉపయోగించి HIVకి వ్యాక్సిన్‌ తయారుచేసే పనిలో నిమగ్నమయి ఉంది.


Read More
Next Story