భారత్ రైస్ కు పోటీ గా కేరళ రైస్
x
Image Source: Manorama Online

భారత్ రైస్ కు పోటీ గా కేరళ రైస్

కేరళలో 'శబరి కే రైస్'ను పంపిణీ చేయాలనుకుంటున్నారు. కేరళ ప్రభుత్వానికి ఇది అదనపు భారమైనా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు?


ఇకనుంచి కేరళ వాసులకు 'శబరి కే రైస్'ను పంపిణీ చేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రైతుల నుంచి బియ్యం సేకరణ కూడా ప్రారంభించారు. 'కె బియ్యాన్ని' కిలో రూ.40.11కి కొని రూ.29 సబ్సిడీపై విక్రయించనున్నారు. శబరి కే రైస్ పథకం కింద జయ బియ్యం రకాన్ని రూ.29, అలాగే కురువ, మట్ట రకాలను కిలో రూ.30లకు విక్రయిస్తారు. రేషన్ కార్డ్ దారులకు ఈ బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు.

50 కిలోల బస్తాలు..

జయ, కురువ, మట్ట బియ్యం రకాల 50 కిలోల బస్తాలను సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు సప్లైకోను ఆదేశించారు. త్వరలో ఒక తేదీని ఖరారు చేసి విక్రయాలు ప్రారంభిస్తారు.

ఎందుకు ఈ నిర్ణయం..

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సిఐ) సరఫరా చేసే 'భారత్ రైస్'ను కొనుగోలు చేయడానికి రేషన్ కార్డు అవసరం లేదు. అయితే ఈ బియ్యాన్ని కేంద్రం సరఫరా చేయకపోవడంతో కేరళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా రాబోయే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

రైస్ బ్యాగుల కొనాలని ఆదేశాలు..

కే బియ్యం పంపిణీకి బ్యాగులు కొనాలని డిపో మేనేజర్లకు ఆదేశాలుందాయి. ఏదైనా డిపోలో క్లాత్ బ్యాగ్‌లు అందుబాటులో లేకపోతే మరో డిపో నుంచి పొందాలని సప్లికో ప్రాంతీయ మేనేజర్లు డిపో మేనేజర్లకు సూచించారు. దాదాపు 50 లక్షల బస్తాలు కొనాల్సి వుంటుందని అంచనా వేశారు.

రైస్ బ్యాగులకే 7.5 కోట్లు ఖర్చు..

గతంలో ఓనం కిట్ బ్యాగును రూ.15లకు కొన్నారు. దీని ప్రకారంగా రైస్ బ్యాగుల సేకరణకు రూ.7.5 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు.

ఇటు సప్లైకో ఉద్యోగులకు ఫిబ్రవరి జీతాల ఇంకా అందలేదు. బియ్యం బ్యాగుల కొనుగోలు భారం, కిలో బియ్యాన్ని రూ.40కి కొని రూ.29కి అమ్మడం ప్రభుత్వానికి మరో అదనపు భారం.

సరఫరాదారుల విముఖత..

గతంలో డెలివరీ చేసిన సరుకులకు సంబంధించి రూ.1000 కోట్లకు పైగా బకాయిలు ఉండడంతో నిత్యావసరాల పంపిణీకి సరఫరాదారులు ఆసక్తి చూపడం లేదు.

Read More
Next Story