సచిన్ కు చద్ది బిర్యానీ బాగా ఇష్టం... పఠాన్ బయటపెట్టిన సీక్రెట్
x

సచిన్ కు చద్ది బిర్యానీ బాగా ఇష్టం... పఠాన్ బయటపెట్టిన సీక్రెట్

తమకు నచ్చింది కావాలని చిన్న పిల్లలు అడిగి, ఇవ్వకుంటే మారం చేస్తారు. అదే లిటిల్ ఛాంపియన్ సచిన్ కూడా పఠాన్ ను కూడా ఓ కోరిక కోరాడు. అదేంటంటే..


భారత క్రికెట్ దిగ్గజం.. ఆల్ టైం గ్రేట్ మాస్టర్ బ్లాస్టర్ తనను కోరిన ఓ కోరిక గురించి మరో మాజీ క్రికెటర్, సచిన్ తో క్రికెట్ ఆడిన సహచర ఆటగాడు ఇర్పాన్ పఠాన్ తాజాగా వివరించారు.

మనందరికి తెలిసిన విషయం ఏంటంటే సచిన్ మంచి భోజన ప్రియుడు. అందులో బిర్యానీ అంటే మాస్టర్ బ్లాస్టర్ ఎంతో ఇష్టంగా తినేవాడు. ఇదే విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఓ రోజు మ్యాచ్ సందర్బంగా జరిగిన సంగతిని ఇర్పాన్ పఠాన్ వివరించాడు.
" అది 2007 టీమిండియా, ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడుతోంది. మేము బరోడాలో క్రికెట్ ఆడుతున్నాం. మీకు తెలుసు అది నా సొంతురూ. నేను అప్పట్లో సరాసరి ఇంటికి వెళ్లాను. అయితే అమ్మ నాకు ఓ విషయం చెప్పింది. ఇంట్లో బిర్యానీ చేస్తున్నామని, మనవాళ్లందరిని( క్రికెటర్లు) తీసుకురమ్మని చెప్పింది. దాంతో మా ఇంటికి సచిన్, హర్భజన్ సహాయక సిబ్బంది సహ మొత్తం 25 మంది వచ్చారు. అమ్మ వండిన బిర్యానీకి బాగా ఆస్వాదించారు. "
" మరుసటి రోజు మాకు మ్యాచ్ ఉంది. బాగా సిద్దం అయి మ్యాచ్ ముందుగానే ముగించాం. మ్యాచ్ పూర్తికాగానే నాకు సచిన్ నుంచి కాల్ వచ్చింది. నాకు నిన్నటి బిర్యానీ కావాలని కోరాడు. నేను సరే అనే కొత్తగా సిద్దం చేస్తా అని చెబితే.. లేదు నిన్నటి బిర్యానీ చాలా బాగుంది. పాత బిర్యానీ టేస్టే వేరు. నాకు అదే కావాలని కోరాడు. అయితే నిన్నటి బిర్యానీ ఏదైన మిగిలితే కదా సచిన్ పెట్టడానికి.. ఇదే విషయం సచిన్ చెప్పి కొత్తగా బిర్యానీ చేయించా" అని ఇర్పాన్ వెల్లడించాడు. ఆ తరువాత ఎప్పుడు నా పుట్టిన రోజు జరిగిన మాకు బిర్యానీ కావాలని సచిన్, హర్బజన్ డిమాండ్ చేశారని అప్పటి సంగతులను ఇర్పాన్ పంచుకున్నాడు.
Read More
Next Story