వచ్చే ఏడాది చివర ‘సముద్రయాన్’ ఉంటుంది: కిరణ్ రిజిజూ
x
కేంద్రమంత్రి కిరణ్ రిజిజూ

వచ్చే ఏడాది చివర ‘సముద్రయాన్’ ఉంటుంది: కిరణ్ రిజిజూ

వచ్చే ఏడాది చివరన భారత్ సముద్రయాన్ నిర్వహిస్తుందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజూ వెల్లడించారు. ఈ సంవత్సరం చివర నుంచి వివిధ రకాల పరీక్షలు ఉంటాయని తెలిపారు.


వచ్చే ఏడాది చివర అంటే 2025 చివరి నాటికి సముద్ర గర్భాన్ని అధ్యయనం చేయడానికి భారత్ సముద్రయాన్ నిర్వహిస్తుందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజూ వెల్లడించారు. సముద్ర గర్భంలోని 6000 మీటర్ల కింద మన సొంతంగా తయారుచేసుకున్న పరిజ్ఞానంతో శాస్త్రవేత్తల బృందాన్నిపంపనున్నట్లు ఆయన వెల్లడించారు.

జాతీయ మీడియాకు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో, రిజిజు మాట్లాడుతూ "భారత్ తయారీ డీప్ సబ్ మెర్సిబుల్ మత్స్య6000. ఇది డీప్ఓషియన్ లోకి మన శాస్త్రవేత్తలను తీసుకెళ్తుంద. ఇది బాగా పని చేస్తోంది. వచ్చే సంవత్సరం చివరినాటికి పని ప్రారంభిస్తుంది. ఈ సంవత్సరం చివర్లో దానికి పరీక్షలు నిర్వహిస్తాం" అని వివరించారు.
ఆ లోతులో సూర్యకాంతి కూడా చేరుకోలేదని, కానీ మనం మాత్రం ఆ సాహాసం చేయబోతున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ ను తాను సమీక్షించానని వెల్లడించారు. ఈ ఏడాది చివరి నాటికి లోతు తక్కువ నీళ్లతో పరీక్షలు చేస్తామని చెప్పారు. "అయితే 2025 చివరి నాటికి శాస్త్రవేత్తలను 6,000 మీటర్ల కంటే ఎక్కువ లోతైన సముద్రంలోకి పంపగలమని నేను విశ్వసిస్తున్నాను" అని రిజిజు చెప్పారు.
సముద్రయాన్, లోతైన మహాసముద్ర మిషన్, 2021లో ప్రారంభించబడింది. ముగ్గురు శాస్త్రవేత్తలకు అవసరమయ్యే వసతిని కల్పించేందుకు రూపొందించిన మత్స్య6000ని ఉపయోగించి హిందూ మహాసముద్రంలోని 6000 మీటర్ల లోతున పరిశోధన చేయాలని భారత ప్రభుత్వం సంకల్పించింది. వీటికి సబ్‌మెర్సిబుల్‌లో సైంటిఫిక్ సెన్సార్‌లు టూల్స్ సూట్ అమర్చబడి ఉంటుంది. మిషిన్ 12 గంటల పాటు నిరంతరాయంగా ఆపరేషనల్
చేయడానికి వీలుగా ఉంటుంది. అత్యవసర సమయాల్లో 96 గంటల పాటు పనిచేసుకోవడానికి కూడా ఇందులో అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు, యుఎస్, రష్యా, చైనా, ఫ్రాన్స్, జపాన్ వంటి దేశాలు లోతైన సముద్ర సిబ్బంది మిషన్‌లను విజయవంతంగా నిర్వహించాయి.
అటువంటి మిషన్లలో నైపుణ్యం, సామర్థ్యాన్ని ప్రదర్శించడం ద్వారా భారతదేశం ఈ దేశాల సరసన చేరడానికి సిద్ధంగా ఉంది.


Read More
Next Story