ఇష్టమైన పోలీసుశాఖ కోసం ప్రాణాలర్పించిన సౌమ్య
x
Excise constable Gajula Soumya

ఇష్టమైన పోలీసుశాఖ కోసం ప్రాణాలర్పించిన సౌమ్య

దాడుల నుండి తప్పించుకునేందుకు వ్యాపారులు కారుతో కానిస్టేబుల్ సౌమ్యను బలంగా ఢీకొట్టారు


మృత్యవుతో పోరాడి అలసిపోయిన గాజుల సౌమ్య చివరకు శనివారం రాత్రి కన్నుమూసింది. ప్రతిరోజు చాలామంది అనారోగ్యంతోనో లేకపోతే ప్రమాదాల్లోను చనిపోతుండటం మామూలే. అయితే ఇష్టమైన పోలీసుశాఖలో చేరి విధినిర్వహణలో భాగంగా అసాంఘీక శక్తులతో పోరాడి తీవ్రంగా గాయాలపాలై చికిత్సపొందుతు ఆసుపత్రిలో మరణించటమే(Excise Constable Soumya) సౌమ్య గొప్పదనం. మరణం ఎవరికైపా బాధాకరమే కాని ధీశాలి సౌమ్య మరణం మాత్రం పోలీసుశాఖకే గర్వకారణంగా నిలిచింది. విషయం ఏమిటంటే (Hyderabad)హైదరాబాదులోని నిమ్స్(NIMS) లో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ శాఖ కానిస్టేబుల్ గాజుల సౌమ్య శనివారం రాత్రి మరణించింది.

అసలు ఏమిజరిగిందో తెలుసుకోవాలంటే ఎనిమిదిరోజులు వెనక్కుపోవాలి. జనవరి 23వ తేదీరాత్రి నిజామాబాద్ లో గంజాయి అక్రమ వ్యాపారాన్ని అడ్డుకునేందుకు ఎక్సైజ్ శాఖలోని బృందం ప్రయత్నించింది. ఆదాడినుండి తప్పించుకునేందుకు వ్యాపారుల్లో కొందరు ఎక్సైజ్ సిబ్బందిపైన ఎదురుదాడిచేశారు. ఇందులో భాగంగానే వ్యాపారులు కారులో పారిపోయేందుకు ప్రయత్నించారు. పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న వ్యాపారులను సౌమ్య ప్రయత్నించింది. దాంతో సౌమ్యనుండి తప్పించుకునేందుకు వ్యాపారులు కారుతో కానిస్టేబుల్ ను బలంగా ఢీకొట్టారు. ఢీ కొట్టడమే కాకుండా కిందపడిపోయిన సౌమ్యపైనుండి కారును రెండుసార్లు తొక్కించారు. దాంతో సౌమ్య కాళ్ళు, పొట్ట, వీపు తదితర ప్రాంతాలు నుజ్జునుజ్జయిపోయాయి.

తీవ్రంగా గాయపడిన సౌమ్యను సిబ్బంది అదేరోజు నిజామాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. దెబ్బతిన్న కిడ్నీని నిజామాబాద్ ఆసుపత్రిలోనే తొలగించారు. అప్పటికే బాడీ అంతా బాగా ఇన్ఫెక్షన్ వచ్చేసింది. దాంతో మరింత మెరుగైన చికిత్స కోసం ఉన్నతాధాకారులు సౌమ్యను హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగంగాలైన నెఫ్రాలజీ, కార్డియాలజీ, మెడికల్ గ్యాస్ట్రో, సర్టికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ తదితర ప్రత్యేక విభాగాల్లోని నిపుణులైన డాక్టర్లు వైద్య సేవలందించారు. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా, అత్యుత్తమ వైద్యాన్ని అందించినా ఫలితం దక్కలేదు. సౌమ్య ఆసుపత్రిలో చేరిన దగ్గర నుండి మంత్రులు దామోదర్ రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావుతో పాటు ఇతర ప్రముఖులు సౌమ్య ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఎవరెన్ని రకాలుగా ప్రయత్నించినా గంజాయివ్యపారులతో పోరాడిన సౌమ్య మృత్యువుతో మాత్రం పోరాడలేక చివరకు అసువులుబాసింది.

సౌమ్యది నిజామాబాద్ లోని మోస్రా మండలం కేంద్రం. పోలీసుశాఖలో చేరాలనే చిన్నప్పటికోరిక సౌమ్యతో పాటు పెరిగిపెద్దయింది. అనుకున్నట్లే కష్టపడి ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్ గా 20 మాసాల క్రితమే చేరింది. ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తున్న సౌమ్య విధినిర్వహణలో 20 నెలలకే మృత్యుకౌగలిలోకి వెళ్ళిపోవటం బాధాకరమనే చెప్పాలి.

Read More
Next Story