ముందస్తు పథకం ప్రకారమే ఈ నివేదికలు: అదానీ గ్రూపు
x

ముందస్తు పథకం ప్రకారమే ఈ నివేదికలు: అదానీ గ్రూపు

షార్ట్ సెల్లింగ్ విషయంలో సుప్రీంకోర్టు తమకు క్లీన్ చిట్ ఇచ్చిందని అదానీ గ్రూప్ వెల్లడించింది. ముందుస్తుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం హిండెన్ బర్గ్ నివేదికలు..


అదానీ విషయంలో సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన హిండెన్ బర్గ్ మాత్రం తన ఆరోపణలు మానడం లేదు. తాజాగా సెబీ చైర్మన్ పై కూడా అనేకానేక అర్ధరహిత ఆరోపణలకు దిగింది. అదానీ షార్ట్ సెల్లర్ విషయంలో సెబీ హిండెన్ బర్గ్ ను సంప్రదించిన కనీసం స్పందించని ఈ సంస్థ మరోసారి ఇదే తరహ ఆరోపణలకు దిగింది.

ఇండియా ఇన్ఫోలైన్ ద్వారా నిర్వహించబడుతున్న ఫండ్ స్ట్రక్చర్‌లో భాగమైన ఆఫ్‌షోర్ సంస్థలలో మాదాబి, ఆమె భర్త పెట్టుబడులు పెట్టారని, అందులో గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ కూడా పెట్టుబడులు పెట్టారని హిండెన్‌బర్గ్ శనివారం పేర్కొంది. వీటి విలువ దాదాపు రూ. 83 కోట్ల వరకూ ఉంటుందని హిండెన్ బర్గ్ ఆరోపించింది. ఇవన్నీ కూడా బెర్మూడా వంటి ట్రాక్స్ ఫ్రీ దేశాల్లో ఉన్నాయంది. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది. హిండెన్ బర్గ్ "హానికరమైన", "మానిప్యులేటివ్ సెలెక్షన్స్" పబ్లిక్ ఇన్ఫర్మేషన్‌గా పేర్కొంది. మాదాబి, ఆమె భర్త ఇప్పటికే ఆరోపణలను కొట్టిపారేశారు .

"హిండెన్‌బర్గ్ చేసిన తాజా ఆరోపణలు, వాస్తవాలు, చట్టాలను నిర్లక్ష్యం చేయడంతో వ్యక్తిగత లాభదాయకత కోసం ముందుగా నిర్ణయించిన అనుకున్న ప్రకారం పథకం సిద్దం చేసి ఆరోపణలకు దిగిందని పేర్కొంది. అదానీ గ్రూపు పై ఇంతకుముందు ఇదే తరహ ఆరోపణలకు దిగడంతో సుప్రీంకోర్టు తమకు క్లీన్ చిట్ ఇచ్చిందని వివరించింది.
హిండెన్ బర్గ్ ప్రకారం.. సెబీ చైర్మన్ పెట్టిన పెట్టుబడులు 2015 నాటివని తెలిపింది. 2017లో SEBI పూర్తి-కాల సభ్యునిగా మాధబి నియామకం జరిగింది. తరువాత చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు.
అదానీ గ్రూప్..
SEBI, "మారిషస్, ఆఫ్‌షోర్ షెల్ ఎంటిటీల గురించి పట్టించుకోలేదని హిండెన్ బర్గ్ ఆరోపించింది. ఈ ఆరోపణలకు అదానీ గ్రూప్ ప్రతిస్పందిస్తూ.. "మా విదేశీ హోల్డింగ్ నిర్మాణం పూర్తిగా పారదర్శకంగా ఉందని, అనేక పబ్లిక్ డాక్యుమెంట్లలో అన్ని సంబంధిత వివరాలు క్రమం తప్పకుండా వెల్లడి చేస్తున్నామని తేల్చి చెప్పింది."
ఈ గ్రూప్ నివేదిక రావడంతో విపక్షాలు మరోసారి అదానీ గ్రూప్ పై విరుచుకుపడ్డాయి. మోదీ, ఆదానీ గ్రూపుకు దోచిపెడుతున్నారని విమర్శించాయి. ఇప్పుడు ఈడీ, సీబీఐ దాడులు చేస్తాయా అని వారు ప్రశ్నించారు.

Read More
Next Story