
చోరీ స్కూటరును పట్టిచ్చిన ట్రాఫిక్ చలాన్ చిత్రం (ఫొటో : ఎక్స్ పోస్టు/ ట్రాఫిక్ పోలీసులు, :ఫైజల్ రెహమాన్ )
చలాన్‌తో చిక్కిన స్కూటర్ దొంగ! సోషల్ మీడియాలో వైరల్
ట్రాఫిక్ పోలీసుల చలాన్ ట్విస్ట్: దొంగ ఫోటోతో దొరికిన స్కూటర్!
హైదరాబాద్ నగరంలో ఓ వినూత్న ఘటన వెలుగులోకి వచ్చింది. చోరీకి గురైన స్కూటర్‌ను దొంగే నడుపుతూ ట్రాఫిక్ ఉల్లంఘన చేయడం, పోలీసులు విధించిన చలాన్ ద్వారా అసలు నిందితుడి ఫోటో బయటపడటం సంచలనం రేపింది. ఈ చలాన్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు చోరీ అయిన వాహనాన్ని స్వాధీనం చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు.
అసలు ఏం జరిగిందంటే...
హైదరాబాద్ నగరంలో పోలీసులు విధించిన ట్రాఫిక్ చలాన్ చోరీకి గురైన స్కూటరును పట్టిచ్చిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.నాటకీయ ఫక్కీలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో సంచలనం రేపింది. చోరీ చేసిన స్కూటరును నిందితుడే హెల్మెట్ ధరించకుండా నడుపుతుండగా ట్రాఫిక్ పోలీసులు క్లిక్ మనిపించి జరిమానా విధించారు.ట్రాఫిక్ పోలీసులు ఈ ట్రాఫిక్ చలాన్ ను స్కూటర్ యజమాని వాట్సాప్ కు పంపించారు. అంతే చలాన్ లో అసలు నిందితుడి ఫొటో దొరకడంతో దాన్ని వాహన యజమాని తన స్నేహితుడు ఫైజల్ రెహమాన్ ద్వారా ఎక్స్ సోషల్ మీడియాలో హైదరాబాద్ పోలీసులను ట్యాగ్ చేస్తూ పోస్టు పెట్టారు. అంతే స్కూటరు దొంగ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు చోరీ అయిన స్కూటరును స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు స్కూటరును చోరీ చేసిన నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
స్కూటర్ చోరీపై ఫిర్యాదు
హైదరాబాద్ నగరానికి చెందిన మహమ్మద్ షకీర్ రెండు నెలల క్రితం తన స్కూటరు చోరీ అయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుపై పోలీసులు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (FIR) నమోదు చేశారు.
చోరీ స్కూటరుపై ట్రాఫిక్ చలాన్
కొన్ని నెలల తర్వాత చోరీ అయిన స్కూటరు ట్రాఫిక్ ఉల్లంఘన పేరిట దాని యజమానికి నగర ట్రాఫిక్ పోలీసులు చలాన్ పంపించారు. ట్రాఫిక్ చలాన్ అందుకున్న యజమాని చోరీ చేసిన దొంగ స్కూటరు నడుపుతుండటం చూసి దాన్ని తన స్నేహితుడైన ఫైజల్ రెహమాన్ కు ఇచ్చి ఆ చలానా చిత్రాన్ని ఆన్‌లైన్‌లో పోలీసులను ట్యాగ్ చేస్తూ షేర్ చేయించారు. అంతే అది సోషల్ మీడియాలో వైరల్ అయింది.చోరీ అయిన స్కూటరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ చిత్రంలోని నిందితుడిపై కేసు నమోదు చేసి, అతని ఆచూకీ కోసం హైదరాబాద్ నగర పోలీసులు గాలిస్తున్నారు.
ఫ్రెండ్లీ పోలీసులకు ధన్యవాదాలు
చోరీ అయిన తన వాహనాన్ని పట్టుకున్న హైదరాబాద్ ఫ్రెండ్లీ పోలీసులకు ధన్యవాదాలు అంటూ స్కూటర్ యజమాని మహమ్మద్ షకీర్, అతని స్నేహితుడు ఫైజల్ రెహమాన్ లు ప్రశంసించారు. ‘‘ చోరీకి గురైన మా స్కూటర్ తిరిగి లభించింది. మీ తక్షణ సహకారానికి ధన్యవాదాలు’’అని వారు పేర్కొన్నారు.
Dear @HYDTP @hydcitypolice
— Faisal Rahman (@rahman0528) April 7, 2026
My vehicle was stolen 3 months ago, and an FIR has already been registered at Habeeb Nagar Police Station.
Today, I received a traffic challan for the same vehicle, and the image clearly shows the thief’s face
I kindly request you to look into this pic.twitter.com/2KaWKn1rgC
టెక్నాలజీ, సోషల్ మీడియా, పోలీసుల సమన్వయం కలిసొస్తే నేరస్తులు ఎంత తెలివిగా తప్పించుకోవాలనుకున్నా చివరకు పట్టుబడాల్సిందేనని ఈ ఘటన మరోసారి నిరూపించింది. తమ వాహనాన్ని తిరిగి అందించిన హైదరాబాద్ ఫ్రెండ్లీ పోలీసులకు యజమాని కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ సంఘటనను అందరికీ జాగ్రత్తగా ఉండాలనే హెచ్చరికగా భావించాలని సూచించారు.
Next Story

