ప్రయాణికులకు రివార్డులు ఇవ్వాలనుకుంటున్న దక్షిణ మధ్య రైల్వే
x

ప్రయాణికులకు రివార్డులు ఇవ్వాలనుకుంటున్న దక్షిణ మధ్య రైల్వే

దేశంలో తొలిసారి రైల్వే ప్రయాణానికి ‘రైల్ మైల్’ రివార్డు పాయింట్స్


మీరు రెగ్యులర్ రైలు ప్రయాణాలు చేస్తున్నారా? మీ ప్రయాణాలను గుర్తు పెట్టుకుని మమ్మిల్ని రైల్వేకి ఆత్మీయుడిగా, మిత్రుడి గుర్తించి రివార్డులు ఇవ్వాలని దక్షిణ మధ్య రైల్వే భావిస్తూ ఉంది. ఇపుడు రైలు ప్రయాణికుడు ఏ క్లాస్ లో ప్రయాణం చేసినా, ఎంతదూరం వెళ్లినా రైల్వే శాఖ మిమ్మల్ని గుర్తు పెట్టుకోదు. అందుకే రేల్వేకి ప్రయాణికుడి మధ్య ఎలాంటి అనుబంధం లేదు. అయితే, ఇపుడు రైల్వే విధేయులై ప్రయాణికులను గుర్తు పెట్టుకుని అదనపు సౌకర్యాలు అందించాలనుకుంటుంది. మీరు ఏ క్లాస్ లో ప్రయాణిస్తున్నారు, ఎన్నాళ్లకొకసారి రైలు ప్రయాణం చేస్తున్నారు, ఎంతదూరం వెళ్లుతున్నారు అనే విషయాలను గుర్తు పెట్టుకుని మీకు రివార్డ్ పాయింట్స్ ఇవ్వాలనుకుంటూ ఉంది. దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ఈ పథకం ప్రవేశపెడుతూ ఉంది. ఈ రివార్డు పాయింట్లను రైల్ మైల్స్ (Rail Miles) అంటారు. దీనిని ప్రయోగాత్మకంగా హైదరాబాద్ (Hyderabad Division)లో ప్రవేశపెడుతున్నారని టైమ్స్ ఆప్ ఇండియా రాసింది. రైల్వే ప్రయాణం విద్యుత్ రైళ్లలో సాగుతుంది కనుక మరొక విధంగా పర్యావరణ అనుకూల రవాణ వ్యవస్థను ప్రోత్సాహిస్తారన్నమాట. అంటే మరొక విధంగా మీరు గ్రీన్ మైల్స్ (Green Miles) రివార్డ్స్ కూడా సంపాదిస్తారన్నమాట. ఇదే విధానం సరకులు రవాణా చేసే వారికి కూడా వర్తిస్తుంది. సరుకు రవాణా, పార్శిల్ కస్టమర్లు రవాణా చేసినపుడు టన్ను-కిలోమీటర్ల ఆధారంగా మైళ్ళ రివార్డులు పొందుతారు. ఇలా రైలు మైళ్లు, గ్రీన్ మైళ్ళు రివార్డులు ఒక స్థాయికి వచ్చాక మీరు వాటిని కొన్ని రైల్వేలు అందించే ప్రయోజనాలు పొందేందుకు వాడుకోవచ్చు.

ప్రయోజనాలు ఏమిటి?

ఈ రివార్డుల కింద రైల్వేలకు చెందిన కొన్ని ప్రయోజనాలు పొందవచ్చు. వీటిలో క్లాస్ అప్‌గ్రేడ్‌లు (లభ్యతను బట్టి) చేసుకునే సౌకర్యం ఉంటుంది. ప్రీమియం లాంజ్‌లు, వెయిటింగ్ హాళ్లకు ప్రవేశం ఉంటుంది. రిటైరింగ్ రూమ్ బుకింగ్‌లు, హోటల్ చైన్‌లు మైక్రో-స్టేలకు, ఛార్జీలకు సంబంధించిన ప్రయోజనాలు పొందవచ్చు.అంటే ధరల కన్సెషన్స్ కూడా ఉంటాయి, హాస్పిటాలిటీ, ఇ-కామర్స్, మొబిలిటీ, స్టేషన్-ఏరియా సేవలలో భాగస్వామి ఆఫర్‌లను ప్రకటిస్తారు. వాటిని వాడుకోవచ్చు. అదనంగా, రైల్వేలలో పదే పదే ప్రయాణించే ప్రయాణికులకు వెండి, బంగారం, ప్లాటినం మోడల్ టైర్-ఆధారిత గ్రేడులు ఇస్తారు. ఈ సిస్టమ్ ఇపుడు విమానాలలో, బ్యాంకులలో కూడా అమలులో ఉంది.

ఇవొఐ ఆహ్వానించిన దక్షిణ మధ్య రైల్వే

ఈ పథకాన్ని అమలు చేసేందుకు అవసరమయిన సాంకేతిక సాయం అందించాలని అంటే దీనికి సంబంధించిరై ల్ మైల్స్ భావన, రూపకల్పన, సాంకేతిక అభివృద్ధి,దానిని అమలు చేసి మెయింటైన్ చేసేందుకు SCR హైదరాబాద్ విభాగం పరిశ్రమలను, స్టార్టప్‌లను, సాంకేతిక సంస్థలను, లాయల్టీ ప్రోగ్రామ్ ఆపరేటర్ల కోరుతూ ఆసక్తి వ్యక్తీకరణలను (Expression of Interest ) ఆహ్వానించింది.

ఎంపికయిన భాగస్వామి రోజువారీ మిలియన్ల కొద్ది వుండే రైల్వే ప్రయాణికుల లావాదేవీలను నిర్వహించగలగాలి, ప్రయాణీకుల రైల్ మైల్, గ్రీన్ మైల్ డేటాను సురక్షితంగా క్రోడీకరించి రియల్-టైమ్ రివార్డుల కోసం వర్గీకరణ చేయాలి.

ఇలాంటి రివార్డుల ప్రథకం ప్రపంచవ్యాపితంగా విమాన ప్రయాణికులకు అందుబాటులో ఉంది. దీని వల్ల విమాన సర్వీసుల్లో బ్రాండ్ లాయల్టీ బాగా వృద్ధి చెందుతున్నదని రుజువయింది. భారతీయ రైల్వేలలో ఇలాంటి లాయల్టీ ఫ్రేమ్‌వర్క్ లేకపోవడం ఆశ్చర్యం. ఇపుడు దక్షిణ మధ్య రైల్వే దీనిని గుర్తించింది


Read More
Next Story