17 మంది అభ్యర్థులను ప్రకటించిన ఉద్ధవ్ శివసేన వర్గం
x

17 మంది అభ్యర్థులను ప్రకటించిన ఉద్ధవ్ శివసేన వర్గం

లోక్ సభ ఎన్నికల వేళ.. ఠాక్రే నేతృత్వంలోని సేన వర్గం బుధవారం (మార్చి 27) తన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది.17 మంది అభ్యర్థులను ప్రకటించింది.


లోక్ సభ ఎన్నికల వేళ.. ఉధ్దవ్ ఠాక్రే నేతృత్వంలోని సేన వర్గం బుధవారం (మార్చి 27) తన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది.17 మంది అభ్యర్థులను ప్రకటించింది. రాయ్‌గఢ్, దక్షిణ ముంబై నియోజకవర్గాలను మాజీ కేంద్ర మంత్రులు అనంత్ గీతే, అరవింద్ సావంత్ కు కేటాయించగా, థానే నుంచి రాజన్ విచారే, ముంబై నార్త్-వెస్ట్ నుంచి అమోల్ కీర్తికర్, ముంబై నార్త్-ఈస్ట్ నుండి సంజయ్ పాటిల్‌లను రంగంలోకి దించింది.

కాగా తమ పార్టీ వంచిత్ బహుజన్ అఘాడి (VBA) ఇకపై శివసేనతో కలిసి పనిచేయడం లేదని ప్రకాష్ అంబేద్కర్ చెప్పారు. తాము స్వయంగా ఎన్నికల పోరులో పోటీ చేస్తానని ప్రకటించారు. థాకరే వర్గం మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడి (MVA)లో భాగం. ఇందులో శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కూడా ఉన్నాయి.

48 లోక్‌సభ స్థానాలున్న మహారాష్ట్రలో ఏప్రిల్ 19 నుంచి ఐదు దశల్లో పోలింగ్ జరగనుంది. 2019లో బీజేపీతో పొత్తు పెట్టుకుని శివసేన పోటీ చేసిన 23 స్థానాల్లో 18 స్థానాల్లో విజయం సాధించింది.

కాగా, జల్నా జిల్లాలో అంబేద్కర్ మరాఠా ఉద్యమకారుడు జరంగేతో సమావేశమై ప్రకాష్ అంబేద్కర్ రాబోయే ఎన్నికలపై చర్చించారు. జారంగే నివాసం ఉంటున్న అంతర్వాలి సారతి గ్రామంలో జరిగిన సమావేశం అనంతరం అంబేద్కర్ మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎన్నికలపై చర్చలు జరిపామని చెప్పారు. కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తారా ? అని అడిగిన ప్రశ్నకు అంబేద్కర్ ఇలా అన్నారు: "మేము తగిన సమయంలో మీకు తెలియజేస్తాం" అని బదులిచ్చారు.

Read More
Next Story