సీనియర్ జర్నలిస్టు షౌకత్ ఆకస్మిక మృతి
x
Journalist SHOUKAT

సీనియర్ జర్నలిస్టు షౌకత్ ఆకస్మిక మృతి

వృత్తిపట్ల నిబద్ధత, చిత్తశుద్ధి ఉన్న జర్నలిస్టు మరణించారని పలువురు సంతాపం వ్యక్తం చేశారు


సీనియర్ జర్నలిస్ట్ షౌకత్ హెచ్ మహమ్మద్ (63) మంగళవారం హైదరాబాద్ లో మరణించారు. స్వల్ప అనారోగ్యంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ షౌకత్ కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె వున్నారు. ఆయన మరణం పట్ల జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశాయి.
విశాఖ కు చెందిన "షౌకత్" 1985లో డక్కన్ క్రానికల్ ఆంగ్ల దినపత్రికలో సబ్ ఎడిటర్ గా చేరారు. షౌకత్ ఇండియన్ ఎక్స్ ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎకనామిక్ టైమ్స్ వంటి వివిధ వార్తా పత్రికల్లో పనిచేశారు. హైద్రాబాద్ లోని డక్కన్ క్రానికల్ లో బిజినెస్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహించారు. అంతకు ముందు మళయాళ మనోరమ గ్రూప్ కు చెందిన “ది వీక్” కు తమిళనాడు ప్రతినిధి గా కొన్ని సంవత్సరాలు పని చేశారు. “టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్” లో కూడా పీఆర్వోగా పని చేశారు. ఆంధ్ర ప్రదేశ్ విభజన తర్వాత విజయవాడలో టైమ్స్ ఆఫ్ ఇండియా స్పెషల్ కరెస్పాండెంట్ గా పని చేశారు. మంచి చదువరిగా పేరున్న షౌకత్ జర్నలిజంలోకి రావడానికి ముందు టీ టేస్టర్ గా కూడా పనిచేశారని ఆయన సన్నిహితులు చెబుతారు. బిజినెస్ జర్నలిజంలో తనదైన ముద్ర వేశారు. వృత్తి నియమాలకు కట్టుబడి పని చేసిన షౌకత్ నిబద్దత కలిగిన జర్నలిస్టుగా పేరుంది.
Read More
Next Story