
స్టాక్ మార్కెట్లు
నష్టాల్లో ట్రేడవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ
ఆసియాలో ప్రతికూల పరిస్థితులు, యూఎస్ టారిఫ్ గడువు తేదీ సమీపించడమే కారణం
ఆసియా మార్కెట్లలో బలహీనమైన అంచనాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ట్రేడింగ్ లోనే 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 146.64 పాయింట్లు క్షీణించి, 81,497.75 వద్ద ముగియగా, 50 షేర్ల ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 47.5 పాయింట్లు తగ్గి 24,933.15 వద్ద ముగిసింది.
సెన్సెక్స్ సంస్థలలో బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, ట్రెంట్, బజాజ్ ఫిన్ సర్వ్, కోటక్, మహీంద్రా బ్యాంక్, టాటామెటార్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. భారతీ ఎయిర్ టెల్, ఇన్పోసిస్, ఎటర్నల్, ఎన్టీపీసీ లాభాలను ఆర్జించిన వాటిలో ఉన్నాయి.
ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా కోస్పీ, జపాన్ నిక్కి 225 ఇండెక్స్, షాంఘై ఎస్ఎస్ఈ కాంపోజిట్ ఇండెక్స్, హాంకాంగ్ హంగ్ సెంగ్ తక్కువగా కోట్ అయ్యాయి. మంగళవారం ముగిసిన అమెరికా స్టాక్ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ట్రేడయ్యాయి.
జాక్సన్ హోల్ సింపోజియంలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ రాబోయే ప్రకటనలు, ఫెడ్ ఇటీవల సమావేశం ఇన్వెస్టర్లను వెనక్కి తిరిగేలా చేసింది. మంగళవారం వరుసగా నాలుగో ట్రేడింగ్ రోజు కూడా సెన్సెక్స్ 370. 64 పాయింట్లు లేదా 0.46 శాతం పెరిగి 81,644.39 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 103.70 పాయింట్లు లేదా 0.42 శాతం పెరిగి 24, 980 పాయింట్ల వద్ద ముగిసింది.
‘‘దీపావళికి ముందు జీఎస్టీలో సంస్కరణలు జరిగే అవకాశం ఉందని ప్రకటన రావడంతో నిఫ్టీ లో ర్యాలీ పెరిగింది. జీఎస్టీ హేతుబద్దీకరణ వల్ల ప్రయోజనం పొందే అవకాశం ఉన్న ఆటో మొబైల్స్, ఎఫ్ఎంసీజీ, బీమా వంటి రంగాలు పెరుగుదల నమోదు చేశాయి’’ అని జియోజిత్ ఇన్వెస్ట్ మెంట్ లిమిటెడ్ చీఫ్ ఇన్వెస్ట్ మెంట్ స్ట్రాటిజిస్ట్ వికే విజయ్ కుమార్ అన్నారు.
‘‘భారత్ - చైనా సంబంధాలు మెరుగుపడటం కూడా ఈ ర్యాలీకి దోహదపడింది. అయితే భారత్ పై కూడా 25 శాతం సెకండరీ టారీఫ్ కు ఆగష్టు 27 వ తేదీ గడువు సమీపిస్తున్నందున స్థిరమైన ర్యాలీ జరిగేందుకు అవకాశం లేదు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ. 634. 26 కోట్ల విలువైన ఈక్వీటీలను ఆప్ లోడ్ చేసినట్లు ఎక్స్ ఛేంజ్ డేటా తెలిపింది. గ్లోబల్ ఆయిల్ బెంచ్ మార్క్ క్రూడ్ బ్యారెల్ 0.11 శాతం పెరిగి 65. 86 డాలర్లకు చేరుకుంది.
Next Story