జీఎస్టీలో సంస్కరణలు ప్రవేశపెట్టాలనే ప్రభుత్వ నిర్ణయంతో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం దూసుకుపోయాయి. ప్రారంభ ట్రేడింగ్ లో 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 888.96 పాయింట్లు పెరిగి 81,456.67 వద్ద ముగిసింది.
50 షేర్ల ఎన్ఎస్ఈ నిఫ్టీ 265.7 పాయింట్లు పెరిగి 24,980.75 వద్ద ముగిసింది. దేశంలో శక్తివంతమైన ఆర్థిక కౌన్సిల్ అయిన జీఎస్టీ కౌన్సిల్ మెజారిటీ రకాలైన వస్తువులపై పన్నులను తగ్గించింది.
రోటీ, పరాఠా నుంచి హెయిర్ ఆయిల్, ఐస్ క్రీం, టీవీల వరకూ సాధారణ వినియోగ వస్తువుల ధరలు తగ్గుతాయి. వ్యక్తిగత ఆరోగ్యం, జీవిత బీమాపై పన్నులు తొలగించారు. నవరాత్రి మొదటి రోజు అయిన సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వచ్చేలా 5 శాతం, 18 శాతానికి స్లాబులను పరిమితం చేస్తూ జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది.
సెన్సెక్స్ లో మహీంద్రా అండ్ మహీంద్రా అత్యధికంగా 7.50 శాతం మేర లాభపడింది. బజాజ్ ఫైనాన్స్, హిందూస్థాన్ యూనిలీవర్, బజాజ్ ఫిన్ సర్వే, ఐటీసీ, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్ కూడా లాభాలబాట పట్టాయి. ఎటర్నల్, టాటా స్టీల్, ఎన్ టీపీసీ, హెచ్ సీఎల్ టెక్ వెనకబడి ఉన్నాయి.
‘‘విప్లవాత్మకమైన జీఎస్టీ సంస్కరణ ఊహించిన దానికంటే మెరుగ్గా ఉంది. ఇది విస్తృత శ్రేణి రంగాలు, ప్రజలకు మేలు చేకూర్చబోతోంది. ధరల తగ్గుదల వలన ప్రయోజనం పొందేది భారతీయ వినియోగదారుడే.
ఇప్పటికే వృద్ది వేగంతో ఉన్న ఆర్థిక వ్యవస్థలో వినియోగానికి పెద్ద ప్రొత్సాహం అందించనుంది’’ అని జియోజిత్ ఇన్వెస్టిమెంట్స్ లిమిటెడ్ చీఫ్ ఇన్వెస్టిమెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్ కుమార్ అన్నారు. అయితే మార్కెట్ ను మాత్రం టారిఫ్ సమస్యలు కూడా ఉంటాయని అభిప్రాయపడ్డారు.
ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియాకు చెందిన కోస్పి, జపాన్ కు చెందిన నిక్కీ 225 ఇండెక్స్ లు కూడా సానుకూలంగా ట్రేడవగా, షాంఘైకి చెందిన ఎస్ఎస్ఈ కాంపోజిట్ ఇండెక్స్, హాంకాంగ్ కు చెందిన హాంగ్ సెంగ్ మాత్రం సాధారణంగా ట్రేడ్ అయ్యాయి. అమెరికా మార్కెట్లు నిన్న లాభాల్లో ముగిశాయి.
నిన్న విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(ఎఫ్ఐఐ)రూ. 1666.46 కోట్ల విలువైన ఈక్విటీలను ఆఫ్ లోడ్ చేయగా, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు(డీఐఐ) రూ. 2,495.33 కోట్ల విలువైన స్టాక్ లను కొనుగోలు చేసినట్లు ఎక్స్ ఛేంజ్ డేటా తెలిపింది.
గ్లోబల్ ఆయిల్ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ కు 0.56 శాతం తగ్గి, 67.22 డాలర్లకు చేరుకుంది. సెన్సెక్స్ 409.83 పాయింట్లు లేదా 0.51 శాతం పెరిగి 80,567.71 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 135.45 పాయింట్లు లేదా 0.55 శాతం పెరిగి 24,715.05 వద్ద ముగిసింది.