సెంథిల్ బాలాజీ బెయిల్ పిటిషన్‌పై జడ్డి తీర్పేంటి?
x

సెంథిల్ బాలాజీ బెయిల్ పిటిషన్‌పై జడ్డి తీర్పేంటి?

తమిళనాడు మాజీ మంత్రి వి సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే బెయిల్ వచ్చిందా .. రాలేదా?


సెంథిల్ బాలాజీ బెయిల్ పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేష్ తీర్పును రిజర్వ్ చేశారు. గత ఏడాది తమిళనాడు మాజీ మంత్రి వి సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పుఝల్ సెంట్రల్ జైలులో ఉన్న బాలాజీ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను అక్టోబర్ 19, 2023న హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. బాలాజీ తరుపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఏఆర్ ఎల్ సుందరేశన్ కేసు వాదిస్తున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఏఆర్ ఎల్ సుందరేశన్ కేసు వాదిస్తున్నారు.

అసలు కేసు ఏమిటి..

జయలలిత హయాంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు బాలాజీ. ఆ సమయంలో ఉద్యోగాల కోసం డబ్బు వసూలు చేశాడని ఆయన మీద ఉన్న అభియోగం. ఈ మనీలాండరింగ్ కేసులో జూన్ 2023న ఈడీ ఆయనను అరెస్టు చేసింది.

సెంథిల్ బాలాజీ ఎవరు?...

బాలాజీ స్వస్థలం కరూర్ సమీపంలోని రామేశ్వరంపట్టీ. వ్యవసాయ కుటుంబంలో 1975 లో జన్మించారు. కళాశాల చదువు మానేసి రాజకీయాల్లో చేరారు. 1990 వ దశకంలో మొదట డీఎంకే లో చేరారు. తరువాత డీఎంకే నుంచి ఎండీఎంకేలో మారాడు. అన్నాడీఎంకే తరుపున 2006 ఎన్నికల్లో కరూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి డీఎంకే అభ్యర్థి వాసుకీ మురుగేషన్ ను ఓడించారు. 2011 లో మరోసారి గెలిచి జయలలిత క్యాబినెట్ లో రవాణా శాఖ మంత్రిగా బెర్త్ దక్కించుకున్నారు. తరువాత ఆర్టీసీ బస్సులపై అన్నాడీఎంకే గుర్తు రెండు ఆకులను వేయించాడు. దీనిపై కరుణానిధి అసెంబ్లీలో ప్రశ్నించగా.. సెంథిల్ సమాధానమిస్తూ.. ఇది తమిళ సాంప్రదాయమైన తులసీ, తమలపాకులు వంటి సంప్రదాయ ఆకులను ప్రజలకు గుర్తు చేస్తున్నామని సమాధానమిచ్చారు. తరువాత బస్సుల్లో " అమ్మా కుడినీర్" ( అమ్మ నీరు) ప్రవేశపెట్టి జయలలితను మరింతగా ఆకట్టుకున్నాడు. తరువాత సెంథిల్ ను జయలలిత తన కొడుకు లాంటివాడని ప్రకటించింది. ఈ నేపథ్యంలో జయలలిత నివాసం పొయోస్ గార్డెన్ తో బాలాజీ సంబంధాలు బలపడ్డాయి.

Read More
Next Story