
‘‘పెన్నైయార్ జల వివాదంపై ట్రిబ్యూనల్ ఏర్పాటు చేయండి’’
కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
తమిళనాడు, కర్ణాటక మధ్య తాజాగా నెలకొన్న పెన్నైయార్ జల వివాదాన్ని పరిష్కరించడానికి ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సోమవారం (ఫిబ్రవరి 2) కేంద్రాన్ని ఆదేశించింది.
అంతర్రాష్ట్ర నది అయిన పెన్నైయార్ జలాలను పంచుకోవడంపై రెండు రాష్ట్రాలు తీవ్రంగా వాదులాడుకుంటున్నాయి. ఇది కేవలం ట్రిబ్యూనల్ మాత్రమే పరిష్కరించగలదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
ఒక నెలలోపు ట్రిబ్యూనల్ నోటిఫికేషన్ జారీ చేయాలని కూడా కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. తమిళనాడు ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు వి కృష్ణమూర్తి, పి విల్సన్ హాజరయి తమ వాదనలు వినిపించారు.
"ఈరోజు నుంచి ఒక నెల వ్యవధిలోపు పార్టీల మధ్య అంతర్ జల వివాదాన్ని పరిష్కరించడానికి అధికారిక గెజిట్‌లో తగిన నోటిఫికేషన్ జారీ చేయాలని, జల వివాదాల ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించకుండా ఉండటానికి మాకు ఎటువంటి కారణం కనిపించడం లేదు" అని జస్టిస్ నాథ్ అన్నారు.
తమిళనాడు ప్రభుత్వం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం, 1956 (కేంద్ర చట్టం 33 ఆఫ్ 1956) కింద దాఖలు చేసిన వ్యాజ్యంపై ఈ ఉత్తర్వులు జారీ చేస్తూ రెండు రాష్ట్రాల మధ్య చర్చలు విఫలమైనందున, సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వు జారీ చేయాల్సి వచ్చిందని డిఎంకె ఎంపి పి విల్సన్ అన్నారు.
జలవివాదాలు..
"సెక్షన్ 4 కింద ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని, కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 8లో ఉన్న నిషేధానికి లోబడి, జల వివాదాలను, దానితో అనుసంధానించబడిన లేదా సంబంధితంగా కనిపించే ఏదైనా విషయాన్ని తీర్పు కోసం ట్రిబ్యునల్‌కు నివేదిస్తుంది" అని వృత్తిరీత్యా న్యాయవాది అయిన విల్సన్ అన్నారు.
చెక్ డ్యామ్‌లు, నదీ జలాల మళ్లింపులపై జరుగుతున్న పనులపై కర్ణాటకపై 1956 చట్టంలోని సెక్షన్ 5 కింద దాఖలు చేసిన అసలు దావా ద్వారా తమిళనాడు ప్రభుత్వం 2018లో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అంతర్రాష్ట్ర నదిలోని నీటిని జాతీయ ఆస్థిగా పరిగణిస్తున్నామని, దానిపై ఏ రాష్ట్రం ప్రత్యేక హక్కులను క్లెయిమ్ చేయలేదని తన పిటిషన్ లో పేర్కొంది.
పెన్నైయార్, దాని ఉపనది మార్కెండేయ మీద కర్ణాటక చేపట్టిన అనేక ప్రాజెక్టులు దిగువన ఉన్న తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయని లేదా ప్రభావితం చేసే అవకాశం ఉందని సుప్రీంకోర్టు లో వేసిన తన పిటిషన్ లో పేర్కొంది.
కేంద్ర జోక్యం కోసం అభ్యర్థన..
పెన్నైయార్ నదీ జలాల వివాదాన్ని పరిష్కరించడానికి 1956 చట్టంలోని సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని తమిళనాడు సుప్రీంకోర్టును కోరింది. చట్టంలోని సెక్షన్ 4 కింద ట్రిబ్యునల్ ఏర్పాటు చేసే వరకు యార్గోల్ గ్రామం సమీపంలో మార్కండేయనదిపై ఆనకట్ట నిర్మాణం చేపట్టకుండా కర్ణాటకను నిరోధించాలని తమిళనాడు సుప్రీంకోర్టును అభ్యర్థించింది.
ఇవే కాకుండా కోలార్ జిల్లాలోని వరతూర్ ట్యాంక్ నుంచి నర్సాపూర్ ట్యాంక్‌కు, ఎల్లమల్లప్ప చెట్టి ట్యాంక్ నుంచి హోస్కోట్ ట్యాంక్‌కు, బెలహళ్లి, తట్టనూర్ గ్రామాల వద్ద పెన్నైయార్ నుంచి నేరుగా నీటిని పంపింగ్ చేయడంతో సహా కర్ణాటక నీటి మళ్లింపు కార్యకలాపాలపై యథాతథ స్థితిని కొనసాగించాచేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టు తమిళనాడు అభ్యర్థించింది. ట్రిబ్యునల్ ఏర్పాటు అయ్యే వరకు పెన్నైయార్ బేసిన్‌లో కర్ణాటక కొత్త ప్రాజెక్టులను ప్రారంభించకుండా నిషేధించాలని రాష్ట్రం కోర్టును కోరింది.
వీటిని పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం తమిళనాడు ప్రభుత్వం కోరినట్లు ట్రిబ్యూనల్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వూలు జారీ చేసింది.
Next Story

