రంజాన్ పై యుద్ధం తీవ్రప్రభావం
x

రంజాన్ పై యుద్ధం తీవ్రప్రభావం

ఉపవాసాన్ని ముగించే సందర్భంగా ఇఫ్తార్ పేరుతో డ్రైఫ్రూట్స్ తో చేసిన వంటకాలను ఎక్కువగా తీసుకుంటారు


రంజాన్ పండుగకు గల్ఫ్ దేశాల యుద్ధ ప్రభావం చాలా తీవ్రంగా పడుతోంది. మామూలుగా రంజాన్ మాసం అంటేనే ముస్లింలకు చాలా ప్రత్యేకమని చెప్పక్కర్లేదు. రంజాన్ మాసంలో నెలంతా ముస్లింలు ప్రధానంగా డ్రైఫ్రూట్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈనెలలో ముస్లింల్లో చాలామంది ఉదయం ఉపవాసం మొదలుపెట్టి సాయంత్రం ముగిస్తారు. ఉపవాసాన్ని ముగించే సందర్భంగా ఇఫ్తార్ పేరుతో డ్రైఫ్రూట్స్ తో చేసిన వంటకాలను ఎక్కువగా తీసుకుంటారు. డ్రైఫ్రూట్స్ అంటే ఖర్జూరాలు, బాదం, పిస్తా, రైసినా, జీడిపప్పు, కిస్మిస్, అంజీర్ తో పాటు కొన్నిరకాల పండ్లముక్కలను కూడా ఉపయోగిస్తారు.

ఇపుడు ఏమైందంటే ఇరాన్-ఇజ్రాయెల్+అమెరికా మధ్య యుద్ధం జరుగుతోంది. 9వ రోజుకు యుద్ధం మరింత ముదురుతోంది. ఎప్పుడైతే ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్ మీదకు యుద్ధం మొదలుపెట్టాయో వెంటనే ఇరాన్ గల్ఫ్ లోని ఇతర దేశాలను కూడా యుద్ధంలోకి అనివార్యంగా లాగింది. ఫలితంగా దుబాయ్, ఖతార్, ఒమన్, సౌదీఅరేబియా, కువైట్, బెహరయిన్ తో పాటు జోర్డాన్ తదితర దేశాలకు కూడా యుద్ధం పాకింది. దాంతో చాలా దేశాలు యుద్ధంతో నానా అవస్తలు పడుతున్నాయి. అందుకనే ముందుగా తమదేశాల్లోని అంతర్జాతీయ విమనాశ్రయాలను మూసేయటంతో పాటు సముద్రమార్గాలను కూడా మూసేశాయి. ఎప్పుడైతే రవాణా మార్గాలను గల్ఫ్ దేశాలు మూసేశాయో వెంటనే సరుకురవాణాకు బ్రేకులుపడ్డాయి.

గల్ఫ్ దిగుమతులే ఎక్కువ

యుద్ధ ప్రభావం ముందుగా వంటింట్లో కనబడింది. ఎలాగంటే గల్ఫ్ దేశాల నుండి మనదేశానికి ఆయిల్, నేచురల్ గ్యాస్, డ్రైఫ్రూట్స్ లాంటివి దిగుమతులు అవుతాయి. యుద్ధం కారణంగా ఇపుడు గ్యాస్ తో పాటు ఆయిల్, డ్రైఫ్రూట్స్ దిగుమతులు ఆగిపోయాయి. ఆయిల్, గ్యాస్ సరఫరా ఆగిపోయిందో వాటి ధరలు పెరిగిపోయాయి. ధరల పెంపు ప్రభావం డ్రైఫ్రూట్స్ మీద కూడా పడ్డాయి. మిగిలిన రాష్ట్రాల సంగతి ఎలాగున్నా తెలంగాణలో మాత్రం రంజాన్ పై యుద్ధ ప్రభావం స్పష్టంగా బయటపడింది. ఇపుడు రంజాన్ మాసం మొదలైన వెంటనే యుద్ధం మొదలవ్వటంతో డ్రైఫ్రూట్స్ దిగుమతులు చాలావరకు తగ్గిపోయాయి. దాంతో వాటి ధరలు బాగా పెరిగిపోతున్నాయి.

తెలంగాణకు ఎక్కువగా గల్ఫ్ దేశాలనుండి డ్రైఫ్రూట్స్ దిగుమతులు అవుతుంటాయి. పిస్తా, అంజీర్, ఖర్జూరాలు, రైసిన్స్ ఇరాన్, ఆఫ్ఘనిస్ధాన్, ఖతార్, ఒమన్, బెహరైన్, జోర్డాన్ లాంటి దేశాల నుండి ఎక్కువగా దిగుమతలువుతుంటాయి. ఇవన్నీ కూడా ఎక్కువగా సముద్రమార్గంలోనే తెలంగాణలోకి వస్తుంటాయి. ఇపుడు హర్మూన్ జలసంధిని ఇరాన్ మూసేయటంతో సరుకురవాణా ఆగిపోయింది. ఫలితంగా దిగుమతులు నిలిచిపోయాయి. ఇపుడు దేశాల నుండి వస్తున్న సరుకు మీదే తెలంగాణ ఆధారపడాల్సొచ్చింది. దీంతోనే వీటి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మామూలు రోజుల్లో కిలో పిస్తా ధర రు.1300లు అయితే ఇపుడు కిలో ధర రు. 2వేలకు పెరిగిపోయింది. అలాగే కిలో ఖర్జూరం ధర రు. 350 నుండి రు. 800కి పెరిగిపోయింది. బాదం కిలో ధర రు. 700 నుండి రు. 1800కి పెరిగిపోయింది. అలాగే అంజీర్ కిలో ధర రు. వెయ్యి నుండి రు. 1500కి పెరిగిపోయింది.

గల్ఫ్ దేశాల నుండి డ్రైఫ్రూట్స్ దిగుమతులకు బ్రేకులు పడ్డాయో వెంటనే ఆఫ్ఘనిస్ధాన్, టర్కీ, ఇటలీ, చైనా, శ్రీలంక, పోల్యాండ్ నుండి కొద్దిమొత్తాల్లో దిగుమతలకు మార్గాలు సుగమమయ్యాయి. గతంలో కూడా పై దేశాల నుండి మనదేశంలోకి కొద్ది పరిణామాల్లో డ్రైఫ్రూట్స్ దిగుమతులు అయ్యేవి. తాజా పరిస్ధితుల కారణంగా దిగుమతులను మరింతగా పెంచుకునేందుకు పై దేశాలు ప్రయత్నిస్తున్నాయి. మనకు సౌదీ అరేబియా, ఖతార్, దుబాయ్, ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి ఖర్జూరాలు ఎక్కువగా వస్తుంటాయి. ఇరాన్, యూఏఈ నుండి పిస్తా దిగుమతి అవుతుంది. అమెరికా, యూఏఈ నుండి ఆల్మండ్స్, రైసిన్స్, వాల్నట్, ఆప్రికాట్స్ దిగుమతి అవుతుంటాయి.

ధరలు పెరగటానికి కారణం

ధరలు అమాంతం పెరిగిపోవటానికి ప్రధాన కారణాలు నాలుగున్నాయి. అవేమిటంటే సముద్రమార్గాల్లో ఆటంకాలు పెరిగిపోతుండటం, షిప్పింగ్ ఖర్చులు తడిసి మోపెడవటం, బీమా ఖర్చులు ఎక్కువైపోవటం, రంజాన్, ఉగాది లాంటి పండుగుల సమయం కావటంతో వాడకం పెరిగిపోయి డిమాండ్ కూడా ఎక్కువైపోవటంతో డ్రైఫ్రూట్స్ ధరలు బాగా పెరిగిపోతున్నాయి. యుద్ధం ఇంకా ఎన్నిరోజులు జరుగుతుందో ? ధరలు ఇంకా ఎంత పెరుగుతాయో తెలీకుండా ఉంది.

Read More
Next Story