ప్రధాని మోదీని పార్లమెంట్ లో కలిసిన శరద్ పవార్..
x

ప్రధాని మోదీని పార్లమెంట్ లో కలిసిన శరద్ పవార్..

దానిమ్మ పండ్లను అందజేసిన సీనియర్ మరాఠీ పొలిటీషియన్


ప్రధాని నరేంద్ర మోదీని ఎన్ సీపీ నాయకుడు మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్ బుధవారం పార్లమెంట్ లోని ఆయన కార్యాలయంలో కలుసుకున్నారు. మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ (ఎంవిఎ) బీజేపీ నేతృత్వంలోని మహాయుతి చేతిలో ఓడిపోయిన కొన్ని వారాల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది.

పశ్చిమ మహారాష్ట్రలోని ఫాల్తాన్‌కు చెందిన ఇద్దరు రైతులతో కలిసి ఆయన ప్రధానిని కలుసుకుని మాట్లాడారు. వారి పొలంలో పండిన దానిమ్మపండ్ల పెట్టెను మోదీకి బహూకరించారు. ఫిబ్రవరిలో దేశ రాజధానిలోని తల్కతోరా స్టేడియంలో జరగనున్న 98వ మరాఠీ సాహిత్య సమ్మేళనాన్ని ప్రారంభించడానికి తనను ఆహ్వానిస్తూ పవార్ ఇటీవల ప్రధానికి లేఖ రాశారు.

ప్రధానితో భేటీ అనంతరం పవార్ మాట్లాడుతూ.. ‘‘నేను సాహిత్య సమ్మేళనం అంశాన్ని ప్రస్తావించలేదన్నారు. ఇదే విషయాన్ని ప్రధాని కార్యాలయం కూడా సామాజిక మాధ్యమం ఎక్స్ లో ధృవీకరించింది. రైతుల బృందంతో కలిసి బుధవారం ప్రధాని మోదీని కలిశారని పీఎంఓ కార్యాలయం తెలిపింది. ప్రధాని మోదీకి ఎన్సీపీ-ఎస్పీ అధినేత దానిమ్మ పళ్లను అందజేస్తున్న ఫొటోలను కూడా పోస్ట్ చేసింది.
గత కొంతకాలంగా మహారాష్ట్రలో రాజకీయాలు మారిపోయాయి. శివసేన, ఎన్సీపీ చీలికకు గురయ్యాయి. ఈ రెండు పార్టీలు కూడా బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. తరువాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో చీలిక వర్గాలు కాంగ్రెస్ తో కలిసి మెజారిటీ సీట్లను సాధించాయి. కానీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఉద్దవ్ ఠాక్రే వర్గం, శరద్ పవార్ వర్గం ఘోరంగా ఓటమి పాలయ్యాయి. అప్పటి నుంచి సీనియర్ పవార్, బీజేపీ పై విమర్శలు చేస్తున్నారు. కానీ హఠాత్తుగా ఆయన ప్రధాని మోదీని కలవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది.


Read More
Next Story