
కేటీఆర్ ఆరోపణలకు శిఖాగోయెల్ సమాధానం చెప్పారా ?
మొదటి అంతస్తులోని మెటీరియల్, ల్యాబ్, ఫైళ్ళు, కొన్ని కేసులకు సంబంధించిన ఎవిడెన్సులు, హార్డ్ డిస్కులు, 40 కంప్యూటర్లు కాలి బూడిద అయిపోయాయి
ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్లుగా తయారైపోయింది తెలంగాణ రాజకీయపార్టీల వ్యవహారం. శనివారం ఉదయం నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ మంటల్లో కాలిపోయింది. మొదటి అంతస్తులోని మెటీరియల్, ల్యాబ్, ఫైళ్ళు, కొన్ని కేసులకు సంబంధించిన ఎవిడెన్సులు, హార్డ్ డిస్కులు, 40 కంప్యూటర్లు కాలి బూడిద అయిపోయాయి. అగ్నిప్రమాద విషయం తెలియగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతు ఓటుకునోటు కేసులో రేవంత్ సాక్ష్యాలకు సంబంధించిన ఆధారాలన్నీ ఉద్దేశ్యపూర్వకంగానే కాల్చేశారు అన్న ఆర్ధం వచ్చేట్లుగా ఆరోపణలతో ట్వీట్ చేశారు. ‘‘ఓటునోటు కేసులోని కీలక ఆడియో రికార్డింగులను మాయం చేసేందుకే ఈ అగ్నిప్రమాదం జరిగిందా ? లేక ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ సృష్టించిన తప్పుడు సాక్ష్యాలను కప్పిపుచ్చే ప్రయత్నమా’’ ? అని నిలదీశారు.
I am guessing the voice recordings of the famous “Vote for Note” case
— KTR (@KTRBRS) February 7, 2026
And trying to cover up for lack of evidence in cooked up political cases like Phone Tapping https://t.co/7bKa4lGAwj
మంటలకు ల్యాబ్ మొత్తం కాలిపోవటంతో ఏయే కీలక ఆధారాలు బూడియ్యాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిజానికి ఈ డిమాండే విచిత్రమైనది. ఎందుకంటే మంటలను నియంత్రించిన తర్వాత కాని ఎవరూ లోపలకు వెళ్ళలేరు. లోపలకు వెళ్ళిన తర్వాతకాని ఏవేవి కాలిపోయాయో చెప్పలేరు. ఈవిషయాలను తెలుసుకునేందుకు సమయం పడతుంది. అన్నీవిషయాలు తెలిసి కూడా కేటీఆర్ కావాలనే వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేయటంలో అర్ధమేంటి ? ట్విట్టర్ వేదికగా ఆరోపణలు, అనుమానాలను వ్యక్తంచేసిన కేటీఆర్ అందుకు ఆధారాలను మాత్రం చెప్పలేదు. కేటీఆర్ అనుమానాలకు, ఆరోపణలకు కాంగ్రెస్ ఎంఎల్సీ అద్దంకి దయాకర్ కూడా అంతే ధీటుగా సమాధానం చెప్పారు.
అయితే ఆరోపణలు, ప్రత్యారోపణలకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ డైరెక్టర్ శిఖాగోయెల్ సమాధానమిచ్చారు. మంటలకు ఆహుతి అయిన ల్యాబ్ ను ఆదివారం ఉదయం శిఖా పరిశీలించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతు 2015 సంవత్సరంలో ఏసీబీకి సంబంధించిన కేసుల్లో 16 మెటీరియల్స్ దగ్ధమైనట్లు చెప్పారు. కేసుకు సంబంధించిన మెటీరియల్స్ 2021లోనే ఏసీబీ కోర్టుకు అందించినట్లు గుర్తుచేశారు. ఓటుకు నోటు కేసులో రిపోర్టులను అప్పుడే ఏసీబీకి ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చేసిందని స్పష్టంచేశారు. ల్యాబ్ లో ఇపుడు ఆధారాలు దగ్ధమైనా ఏసీబీ దగ్గర అన్నీ ఆధారాల కాపీలు భద్రంగా ఉన్నాయన్నారు. కాబట్టి కేటీఆర్ ఎలాంటి ఆందోళన పెట్టుకోవక్కర్లేదు.
అలాగే 2024 సంవత్సరంలో పంజాగుట్ట పోలీసు స్టేషన్ కి సంబందించిన టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో 136 మెటీరియల్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు వచ్చినట్లు తెలిపారు. ప్రమాదంలో 7 మెటీరియల్స్ మాత్రమే కాలిపోయాయని, వాటిని తిరిగి తీసుకొస్తామని స్పష్టంచేశారు. ఈవిషయం కేటీఆర్ లో టెన్షన్ పెంచేస్తుందేమో. ప్రమాద కారణాలపై విచారణ జరుగుతున్నట్లు డైరెక్టర్ చెప్పారు.

