
రేపే తెలంగాణ గవర్నర్‌గా శుక్ల ప్రమాణ స్వీకారం
లోక్ భవన్‌లో జరిగే కార్యక్రమంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ చేత కొత్త గవర్నర్ ప్రమాణం. సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు.
తెలంగాణకు కొత్త గవర్నర్‌గా నియమితులైన శివప్రతాప్ శుక్లా బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. కొత్త గవర్నర్‌కు తెలంగాణ హైకోర్టు ప్రధాన్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ప్రమాణ స్వీకారం చేయడం కోసం మంగళవారం ఉదయం శుక్లా.. హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. ఆ నిర్ణయంలో భాగంగా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా కొనసాగుతున్న శివప్రతాప్ శుక్లాను తెలంగాణకు బదిలీ చేసింది. ఇక తెలంగాణలో గవర్నర్‌గా పని చేసిన జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేశారు. ఆయన ఇప్పటికే బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. ఈ నేపథ్యంలో శుక్ల ప్రమాణ స్వీకారంతో తెలంగాణలో కొత్త గవర్నర్ అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు.

