
దుమ్మురేపనున్న మంగ్లి
వేడుకలకు మరింత రంగు అద్దేందుకు హ్యాండ్లూమ్స్ హ్యాండీక్రాఫ్ట్స్ స్టాల్స్ ఏర్పాటు
తెలంగాణ సాంస్కృతిక గాయనుల్లో మంగ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈవెంట్ ఏదైనా మంగ్లీ ఉందంటే ఆ సందడే వేరు. అందుకే చాలా మంది ఈవెంట్స్‌కు మంగ్లీని ప్రిఫర్ చేస్తారు. మంగ్లీ తనతో పాటు ఒక సెలబ్రేటివ్ వైబ్‌ను తీసుకొస్తుంది. అందుకే మంగ్లీ పాటలంటే ఆడియన్స్ చెవులు కోసేసుకుంటారు. ఆఖరికి స్టార్ ఫుట్‌బాలర్ మెస్సీ.. హైదరాబాద్‌కు వచ్చిన సమయయంలో కూడా మంగ్లీ కాన్సర్ట్ నిర్వహించారు. అది మంగ్లీ అంటే. అలాంటి స్టార్ సింగర్.. శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో సింగర్ దుమ్మురేపడానికి సిద్ధమవుతోంది. సంక్రాంతి సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న కైట్ ఫెస్టివల్, స్వీట్ ఫెస్టివల్‌లో భాగంగా మంగ్లి స్పెషల్ ప్రోగ్రామ్‌ను కూడా తెలంగాణ పర్యాటక శాఖ ఏర్పాటు చేస్తుంది. ఈ విషయాన్ని పర్యాటక శాఖ అధికారికంగా ప్రకటించింది. జనవరి 16న సాయంత్రం 7 గంటల సమయంలో గాయని మంగ్లీతో ప్రత్యేక కాన్సర్ట్ నిర్వహించనున్నట్లు పేర్కొంది.
సంక్రాంతి పండుగ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన అంతర్జాతీయ పతంగుల పండుగ మిఠాయిల పండుగకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రాష్ట్ర ప్రజలందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
పండుగ ఉత్సాహాన్ని కొనసాగిస్తూ ఈ నెల 16 నుంచి 18 వరకు సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో హాట్ ఎయిర్ బలూన్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ వేడుకలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. 16వ తేదీ సాయంత్రం 7 గంటలకు ప్రముఖ గాయని మంగ్లీ లైవ్ కాన్సర్ట్ ప్రేక్షకులను అలరించనుంది.
ఈ వేడుకలకు మరింత రంగు అద్దేందుకు హ్యాండ్లూమ్స్ హ్యాండీక్రాఫ్ట్స్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. రుచికరమైన వంటకాలతో ఫుడ్ స్టాల్స్ కూడా సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. అదేవిధంగా 16 17 తేదీల్లో గచ్చిబౌలి స్టేడియంలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు డ్రోన్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. డ్రోన్ రేస్ డ్రోన్ సాకర్ వర్చువల్ ఎక్స్పీరియన్స్ తెలంగాణ పర్యాటక ప్రదేశాలపై ప్రత్యేక షో లాంటి కార్యక్రమాలు ఈ ఫెస్టివల్‌లో ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి.
పండుగ వేళ కుటుంబ సభ్యులతో స్నేహితులతో కలిసి ఈ ప్రత్యేక కార్యక్రమాలను ఆస్వాదిస్తూ తెలంగాణ టూరిజం అందిస్తున్న అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. సంస్కృతి సాంకేతికత పర్యాటకం కలసిన ఈ వేడుకలు రాష్ట్రానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తున్నాయి.

