జేఎంఎంకు గుడ్ బై చెప్పిన సీతా సోరెన్..
x

జేఎంఎంకు గుడ్ బై చెప్పిన సీతా సోరెన్..

జేఎంఎం అధినేత శిబు సోరెన్ పెద్ద కోడలు పార్టీకి, పదివికి రాజీనామా చేశారు. ఢిల్లీలో బీజేపీ అగ్రనేతల సమక్షంలో కమలం పార్టీలో చేరిపోయారు.


జార్ఖండ్‌లో జేఎంఎంకు ఎదురు దెబ్బ తగిలింది. జేఎంఎం అధినేత శిబు సోరెన్ పెద్ద కోడలు సీత సోరెన్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. మూడు పర్యాయాలు ఎమ్మెల్యే అయిన సీతా సోరెన్ ప్రస్తుతం జామా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే, జార్ఖండ్ ఎన్నికల ఇన్‌ఛార్జ్ లక్ష్మీకాంత్ బాజ్‌పాయ్ సమక్షంలో ఆమె మంగళవారం కమలం పార్టీలో చేరారు. శిబు సోరెన్ పెద్ద కొడుకు దుర్గా సోరెన్ అనారోగ్యంతో మరణించారు. చిన్న కొడుకు మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్.
సీత , జేఎంఎంకు నాయకత్వం వహిస్తున్న హేమంత్ సోరెన్ కుటుంబానికి మధ్య విభేదాలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. దాదాపు పదిహేనేళ్లపాటు పార్టీకి సేవలు చేసినా తనను పట్టించుకోలేదని అసంతృప్తితో ఉన్న సీతా సోరెన్ పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. బీజేపీలో చేరాలని సీతా సోరెన్ తీసుకున్న నిర్ణయం ఆమె 15 ఏళ్ల సుదీర్ఘ అసంతృప్తిని ప్రతిబింబిస్తుంది. వచ్చే ఎన్నికల్లో జార్ఖండ్‌లో బీజేపీ మంచి పనితీరు కనబరుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
‘కుటుంబంలోనే కాదు పార్టీలో కూడా తగిన గౌరవం దక్కడం లేదు. ప్రస్తుతం జరుగుతోన్న పరిణామాలతో విసిగిపోయా. తనకు, కుటుంబానికి వ్యతిరేకంగా పార్టీలో కుట్ర జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో రాజీనామా చేయడం తనకు తప్ప మరో మార్గం లేదు అని’ రాజీనామా లేఖలో సీత సోరెన్ వెల్లడించారు.
Read More
Next Story