‘అమేథీని అభివృద్ధి చేసి చూయించాం..’: స్మృతి ఇరానీ
x

‘అమేథీని అభివృద్ధి చేసి చూయించాం..’: స్మృతి ఇరానీ

50 ఏళ్లలో చేయని అభివృద్ధి పనులను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అమేథీలో జరిగాయని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు.


కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రంలో తన తల్లి ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు, అలాగే ఉత్తరప్రదేశ్‌లో తన సహచరుడు అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం ఉన్నప్పుడు అమేథీ అభివృద్ధిపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏ మాత్రం శ్రద్ధ చూపలేదన్నారు. అమేథీ తమ కుటుంబమని చెప్పుకుంటున్నారే తప్ప కుటుంబ బాధ్యతలను నెరవేర్చలేదని ఇరానీ ఆరోపించారు.

అమేథీ నుంచి కితావార్ (ప్రతాప్‌గఢ్) రహదారి డబ్లింగ్ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం విశేశ్వర్‌గంజ్‌లోని కాలీజీ మైదాన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు.

50 ఏళ్లలో చేయని పనిని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అమేథీలో చేశామని, ప్రస్తుత ప్రభుత్వం ఐదేళ్లలో చేసి చూపించిందని ఇరాణి పేర్కొన్నారు.

2019లో ప్రధాని మోదీ అమేథీలో పర్యటించి మార్పు తీసుకొస్తానని హామీ ఇచ్చారని అమేథీ సిట్టింగ్ ఎంపీ ఇరానీ అన్నారు. ఆ హామీ మేరకు గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి పనుల కారణంగా అమేథీ ఇప్పుడు భిన్నంగా కనిపిస్తోందన్నారు.

అమేథీలో ఇప్పటివరకు కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించకపోవడంపై ఇరానీని ప్రశ్నించగా.. గత ఐదేళ్లలో ఇక్కడ ఎంతో అభివృద్ధి జరిగింది. దాన్ని చూసిన కాంగ్రెస్ ఇప్పడు తమ అభ్యర్థిని నిలబెట్టేందుకు భయపడుతుంది. అమేథీ ప్రజలు తమకు మద్దతు ఇవ్వడం లేదని కాంగ్రెస్ వాళ్లు అర్థం చేసుకున్నారు అని చెప్పారు.

Read More
Next Story