కథకుడుగా పీవీ నరసిహంహారావు, ఇదీ ఆయన రాసిన కొన్ని కథల నేపథ్యం
మాజీ ప్రధాని పివి నరసింహారావు కవిత్వంరాశారు, కథలు రాశాలు, నవలలూ రాశారు. అనువాదం చేశారు. ఆయన కథల నేపథ్యం నడుస్తున్న చరిత్రయే. ఈ నాలుగు కథల సంగతి చూడండి
-డాక్టర్ గంధం సుబ్బారావు
హైదరాబాద్ లో పీవీ, బూర్గుల రామకృష్ణారావు గారి వద్ద జూనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించేనాటికి భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. దేశమైతే స్వాతంత్రమైంది కాన్సీ హైదరాబాద్ రాజ్యం రజాకార్ల దురంతాలతో అల్లకల్లోలమైపోయింది. ప్రభుత్వం అండ ఉండడంతో వారి హింసాకాండకు అడ్డూ అదుపూ లేకపోయింది. మతకలహాలు పెట్రేగడంతో హిందూ న్యాయవాదులు మొత్తంగా కోర్టులను బహిష్కరించి తమ వృత్తిని మానుకున్నారు. పీవీ కి తన వకాలత్ పై ఆశలుడిగి, హైదరాబాద్ నుంచి మకాం ఎత్తేశారు.
బ్లూ సిల్క్ శారీ (కథ)
ఆ రోజుల్లో పీవీ “బ్లూ సిల్క్ శారీ” (నీలం పట్టు చీర) అనే ఒక పెద్ద కథను ఆంగ్లంలో రాశారు. మతకలహాల్లో ముఖ్య పాత్రధారులు కేవలం గూండా శక్తులేనని వారికి కావలసింది మతం కాదని, తేరగా దొరికే ప్రజల ధన, మాన, ప్రాణాలేనని ఈ కథ వృత్తాంతం.
హైదరాబాద్ నంస్థానంలో వరిన్ఫితులు రోజురోజుకు దిగజారుతుండడంతో, పీవీ మద్రాసు వెళ్ళి అక్కడ కరపత్రాలు రాసి అన్ని ప్రాంతాలలోని ప్రముఖ వ్యక్తులకు, సంస్థలకు పేరుపేరునా పంపారు. కొందరు పత్రికాధిపతులను కలిసి, హైదరాబాద్ పరిస్థితిని వివరించి, వారి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. కానీ దాని వల్ల ఆశించిన ఫలితం కనిపించలేదు. ఇందువల్ల ప్రయోజనం లేదని భావించిన పీవీ మద్రాసు నుంచి బయల్దేరి రహస్యంగా మహారాష్ట్రలోని చాందా చేరుకొని అక్కడి స్టేట్ కాంగ్రెస్ క్యాంపులో చేరిపోయి సాయుధ ప్రతిఘటన ఉద్యమంలో పాల్గొన్నారు. యువకులకు గెరిల్లా పోరాట పద్ధతుల్లో శిక్షణ ఇవ్వటం, రైఫిళ్ళు, బాంబులు, స్టైన్ గను వంటి మారణాయుధాలను సమకూర్చడం మొదలైన బాధ్యతలను పీవీ ఇక్కడ నిర్వర్తించారు.
గొల్ల రామవ్వ (కథ)
ఈ నేపథ్యంలో పీవీ గారు “గొల్ల రామవ్వ” అనే విప్లవ కథను రాశారు. అందులో తెలంగాణాలో ఒక గ్రామంలో కాంగ్రెస్ గెరిల్లా వీరుడి జాడను పసిగట్టి, పోలీసులు అతని వెన్నాడుతారు. అతడు ప్రాణభయంతో పరిగెత్తి అర్ధరాత్రి వేళ ఒక గుడిసెలో దూరుతాడు. ఆ ఇల్లు గొల్లరామవ్వ అనే అమాయక వృద్దురాలిది. ఆమెకు పరిస్థితి అర్ధం కావడానికి ఎంతో సమయం వట్టలేదు. అతని దేహం గాయాలతో నిండి వుంది. పోలీసులు అతనిని తరుముతున్నారని ఏకు అర్థమైంది. అతనిని ఎవరని ప్రశ్నించగా నేను విప్లవ యోధుడిని వేవుు పోలీనులను ఎదిరించి, మీకోనం పోరాడుతున్నామని చెప్పాడు. అతను తన గుడిసెలో ఉంటే తన ప్రాణాలకే ముప్పని ఆమె తెలుసుకుంది. అయితే ఆమెలోని త్యాగశీలత మేల్కొని, ఇతను మనకోసం (ప్రాణాలకు తెగించాడు - ఇతనికి సాయం చేస్తే పోయేది నా ముసలి ప్రాణమే కదా అని నిర్ధారణకు వచ్చి, తన ప్రాణాలకు తెగించి, ఆ వీరుడికి తన గుడిసెలో రక్షణనివ్వడం ఈ కథ వృత్తాంతం. ఒక వక్క పోలీసుల భయం. మరొక వంక తమందరి కోసం చావుకు వెరవక పోరాడుతున్న యువకునికి రక్షణనివ్వాలన్న తాపత్రయంతో ఆ ముసలి ప్రాణం కొట్టుమిట్టాడింది.
ఈ రెండు ద్వంద భావాల సంఘర్షణ ఈ కథలో నాటకీయంగా చిత్రితమైంది. ఆకలితో నకనకలాడుతున్న ఆ గెరిల్లా యోధుడికి తనకున్నదేదో పెట్టి ఆకలి తీర్చడమే కాక, యుక్తవయస్కురాలైన తన మనవరాలి పక్కలో పడుకోపెట్టి, నిజాం పోలీసులు వచ్చినప్పుడు అతను తన మనవరాలి పెనిమిటి అని చెప్పి, వారిని నమ్మించి ఆ యువకుడిని కాపాడి తన ఔదార్యం చాటుకుంది.
ఈ కథ కాకతీయ” పత్రికలో 15 ఆగష్టు 1949 సంచికలో “విజయ” అనే మారుపేరుతో పీవీ రాశారు. ఉత్తర తెలంగాణ మాండలికంలో ఆసక్తికరంగా సాగే కథ ఇది. 1955 లో “విసృత కథా సంకలనం” ప్రచురించే సందర్భంలో కథా రచయిత శ్రీపతి చొరవ, పరిశోధనతో ఇది బయటపడింది. పీవీ మరణానంతరం 2 జనవరి 2005 నాటి 'వార్త' దినవత్రిక ఆదివారం ప్రత్యేక సంచికలో ఈ కథ పునర్శుద్రితమైంది.
ఆ రోజుల్లో పీవీ గారు “జయా “విజయ”, “రాజహంసొ “భట్టాచార్య”, “రాజా” “విజయం” ఇత్యాది మారు పేర్లతో ఈ రకమైన కథలు, వ్యాసాలు ఎన్నో రాసి, తాము వరంగల్ నుంచి నిర్వపొన్తున్న కాకతీయ వత్రికలోనూ, ఇతర పథత్రికల్లోనూ ప్రచురించారు. ఆ తరువాత పుట్టిన తన కుమార్తెలకు “జయ, విజయ” అనే పేర్లనే పెట్టుకున్నారు.
మంగయ్య అదృష్టం (కథ)
పీవీ రాసిన మరొక పెద్ద కథ 'మంగయ్య అదృష్టం”. ఇది 1999 నవంబర్ 8 నాటి ఆంధ్రప్రభ వార పత్రికలో ప్రచురితమైంది. దీనిని ఆ వత్రికవారు నవలిక అని పేర్కొన్నారు. ఏమాత్రం విద్యాబుద్దులు లేని ఒక నీచుడిని కూడా అదృష్టం వుంటే, ఎన్ని అవరోధాలెదురైనా, రాజకీయ పదవులు ఏ విధంగా వరిస్తాయో తెలిపే వ్యంగ్య రచన ఇది. ఆద్యంతమూ ఒకే అంశంలో సాగిన ఈ రచన ఒక ఆహ్లాదకరమైన 'పొలిటికల్ సెటైర్. దేవతల మధ్య చెలరేగిన ఒక అంతః కలహం తారాస్థాయికి చేరి తమతమ శక్తులను పరీక్షించుకోడానికి మంగయ్య అనే ఒక అనామక నిరక్షరకుక్షిని ఎంచుకున్న అపూర్వ ఘట్టం దీని ఇతివృత్తం. పీవీ గారు ఎంత సమర్థంగా అధిక్షేపాన్ని రచనలో నిర్వహించగలరన్నదానికి ఇదొక ఉదాహరణ.
సారోస్ ఆఫ్ ఎ మినిస్టర్ (ఒక మంత్రి గారి బాధలు) (కథ)
1968 జనవరిలో హైదరాబాద్‌లో అఖిల భారత కాంగైెన్ కమిటీ ప్లీనరీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రత్యేక సంచిక ప్రచురణ బాధ్యత పీవీ నరసింహారావు గారికి అప్పగించబడింది. సావనీర్ కమిటీ వైర్మన్ పీవీ గారే. 07.01.1968 న విడుదలైన ఈ సావనీర్‌లో పీవీ గారు ఆంగ్లంలో “సారోస్ ఆఫ్ ఎ మినిస్టర్” (ఒక మంత్రి గారి బాధలు) పేరుతో ఒక కథను రాశారు. ఎన్నికల సమయంలో తమ వారితో ఓట్లు వేయించి, గెలిపించిన ముఠా నాయకులు, ఆ నేత గెలిచి మంత్రి అయిన తరువాత తమ స్వార్ధ ప్రయోజనాలు నెరవేర్చుకోడానికి నిబంధనలను తుంగలో తొక్కి ఎంత అడ్డగోలుగా వనిచేయమని ఆయనను వేధిస్తారో వివరించే వ్యంగ్య చిత్రీకరణ ఈ కథ. ఇది పీవీ గారి స్వానుభవం గానే భావించవచ్చు.
(ఇది డాక్టర్ గంధం సుబ్బారావు అమ్మనుడి లో రాసిన వ్యాసం నుంచి తీసుకున్నది)