ఎదిగిన ఇద్దరు బిడ్డలతో సాఫ్ట్ వేర్ తల్లి ఆత్మహత్య
x

ఎదిగిన ఇద్దరు బిడ్డలతో సాఫ్ట్ వేర్ తల్లి ఆత్మహత్య


ఇద్దరు ఎదిగిన పిల్లలతో ఒక ఒక సాఫ్ట్ వేర్ తల్లి హైదరాబాద్ సమీపాన రైలు కింద పడి ఆత్మ హత్య చేసుకుంది. ఈ విషాదం శనివారం తెల్లవారుజామున జరిగి ఉంటుందని అనుకుంటున్నారు. చర్లపల్లి , ఘటకేసర్ మధ్య రైలు పట్టాల మీద ఈ ముగ్గురి మృత దేహాలు కనిపించాయి. తల్లి పేరు విజయ అని గుర్తించారు. ఆమె సాఫ్ట్ వేర్ ఇంజనీర్. కుమారుడి పేరు విశాల్. వయసు 17 సంవత్సరాలు. కూతురు చేతన వయసు 18. ఆత్మహత్యకు కారణాలు తెలియడం లేదు. చెంగిచర్ల ప్రాంతానికి చెందిన విజయ తన కూతురు స్టేషన్ సమీపంలో పార్క్ చేసి ఆత్మహత్యకు పాల్పడిందని అనుమానిస్తున్నారు. ఆమె భర్త సురేందర్ రెడ్డి దుబాయ్ లో ఉంటున్నారని ఒక సమాచారం. అయితే, భర్త నెల్లూరు లో ఉంటున్నారని కొందరుచెబుతున్నారు. కార్ లో ఆత్మహత్యలేఖ కనిపించింది. జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఆమె లేఖ లో రాసింది. కారణాలు లేవు. పిల్లలను విడిచి వెళ్లలేనని, అందుకే వారితో కలసి వెళ్లిపోతున్నట్లు ఆమె లేఖలో రాసింది.

ఈ ముగ్గురి మృతదేహాలను చూసి అటుగా వస్తున్న గూడ్స్ రైలు లోకో పైలట్ బండిని ఆపి పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిసింది. దీనితో పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి విచారణ ప్రారంభించారు. ఆమె పూర్తి పేరు పిన్నింటి విజయ శాంతి అని, కూతురు చేతన(ఇంటర్ సెకండ్ ఇయర్), కొడుకు విశాల్ రెడ్డి(ఇంటర్ ఫస్ట్ ఇయర్)లతో కలిసి ఉంటున్నదని తెలిసింది. ఆత్మహత్య వెనక కారణలు, కుటుంబానికి చెందిన పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.


Read More
Next Story