సందేశ్ ఖాలీ బాధితుల కోసం ప్రత్యేక ఈమెయిల్..
x

సందేశ్ ఖాలీ బాధితుల కోసం ప్రత్యేక ఈమెయిల్..

పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో మహిళలపై నేరాలు, భూకబ్జాలకు సంబంధించిన ఫిర్యాదుల నమోదు కోసం సీబీఐ ప్రత్యేక ఇమెయిల్ కేటాయించింది.


పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో మహిళలపై నేరాలు, భూకబ్జాలకు సంబంధించిన ఫిర్యాదుల నమోదు కోసం సీబీఐ ప్రత్యేక ఇమెయిల్ కేటాయించింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ్‌ఖాలీ ప్రజలు తమ ఫిర్యాదులను ఈమెయిల్ (sandeshkhali@cbi.gov.in) కు పంపాలని అధికారులు కోరారు.

"కలకత్తా హైకోర్టు డివిజన్ బెంచ్ ఏప్రిల్ 10, 2024న జారీ చేసిన ఉత్తర్వును అనుసరించి.. మహిళలపై నేరాలు, బలవంతంగా భూమిని లాక్కునే విషయంలో సందేశ్‌ఖాలీకి చెందిన వ్యక్తుల ఫిర్యాదులను దాఖలు చేయడానికి CBI ప్రత్యేక ఇమెయిల్‌ను రూపొందించింది." అని సీబీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈమెయిల్ ఐడిని జిల్లా మేజిస్ట్రేట్ విస్తృతంగా ప్రచారం చేయాలని, సర్క్యులేషన్ ఉన్న ప్రాంతీయ వార్తాపత్రికలలో ఈ మెయిల్ కు సంబంధించి ప్రకటన ఇవ్వాలని కూడా సూచించింది సీబీఐ.

"నిష్పాక్షిక విచారణ" జరగాలంటూ మహిళలపై నేరాలు సందేశ్‌ఖాలీలో భూకబ్జా ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించింది.

Read More
Next Story