తెలంగాణలో ఓటరు జాబితా స్పెషల్ రివిజన్‌కు నోటిఫికేషన్
x

తెలంగాణలో ఓటరు జాబితా స్పెషల్ రివిజన్‌కు నోటిఫికేషన్

నకిలీ ఓటర్ల తొలగింపు, ఓటరు జాబితా ప్రక్షాళన లక్ష్యంగా దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ప్రారంభానికి ఏర్పాట్లు.


తెలంగాణ ఓటరు జాబితా ప్రక్షాణళకు రంగం సిద్ధమయింది. రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించడానికి ఎన్నికల సంఘం రెడీ అయింది. ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో తెలంగాణ సహా మొత్తం 22 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. నకిలీ ఓట్లు, మరణించిన వారి ఓట్లు, పక్క ప్రాంతాలకు బదిలీ అయిన ఓటర్ల ఓట్లను, డూప్లికేట్ ఓట్లను తొలగించడం ఎస్ఐఆర్ ముఖ్యఉద్దేశం. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం ఎస్ఐఆర్‌ను తీసుకొచ్చింది. తాజాగా ఈ ఎస్ఐఆర్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

ఈ ప్రక్రియలో భాగంగా తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ చేపట్టాలని నిర్ణయించారు. ఓటరు జాబితాను సమగ్రంగా పరిశీలించి లోపాలను సరిదిద్దడం, చెల్లని పేర్లను తొలగించడం, అర్హులైన కొత్త ఓటర్లను చేర్చడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా ఉంది. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను దశలవారీగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రణాళిక రూపొందించింది. ఏప్రిల్ నెలలో ఈ కార్యక్రమం ప్రారంభం కానుండగా, దీనికి సంబంధించిన సన్నాహకాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

దేశవ్యాప్తంగా ఓటరు జాబితా సవరణను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అయితే ఈ ప్రక్రియపై కొన్ని రాజకీయ పార్టీలు, వర్గాల నుంచి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఎన్నికల కమిషన్ మాత్రం ఓటరు జాబితా ఖచ్చితత్వం కోసం ఈ చర్యలు అవసరమని స్పష్టం చేస్తోంది. రాబోయే ఎన్నికల దృష్ట్యా ఓటరు జాబితాను మరింత పారదర్శకంగా, విశ్వసనీయంగా తయారు చేయడమే ఈ ప్రక్రియ లక్ష్యంగా ఉందని అధికారులు చెబుతున్నారు.

Read More
Next Story