కొత్త రికార్డులు నెలకొల్పుతున్న లెప్ట్ హ్యండర్ జోడీ
x

కొత్త రికార్డులు నెలకొల్పుతున్న లెప్ట్ హ్యండర్ జోడీ

ఒకప్పుడు ముంబై, సీఎస్కేను పెద్ద జట్లుగా చూసేవారు. ఇప్పుడు సీన్ మారింది. హైదరాబాద్ సన్ రైజర్స్ ఓపెనింగ్ జోడి ధాటికి కొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి.


ఐపీఎల్ లో బ్యాట్స్ మెన్ హవా కొనసాగుతోంది. అందులో ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. శనివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం లో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎస్ ఆర్ హెచ్ బ్యాట్స్ మెన్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ముఖ్యంగా SRH ఓపెనర్లు ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ రికార్డులు బద్దలు కొట్టారు. DC కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలిచిన తర్వాత SRHని బ్యాటింగ్‌కు ఆహ్వానించారు. ఈ లెప్ట్ హ్యాండర్లు క్రీజులో దిగిన నుంచి బాదడం మొదలు పెట్టారు. పవర్ ప్లే ఆరు ఓవర్లలోనే ఈ జోడీ 125 పరుగులు సాధించారంటే ఏ రేంజ్ లో ఢిల్లీ బౌలర్లపై దాడి చేశారో ఊహించండి.

ఆరు ఓవర్లలో 125 పరుగులు చేయడం ఐపీఎల్‌లోనే కాకుండా టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక స్కోరు. 2017లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)పై కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) చేసిన 105/0 IPLలో ఇప్పటి వరకూ అత్యుత్తమ పవర్‌ప్లే స్కోరు. ఇప్పుడు ఎస్ఆర్ హెచ్ ఈ రికార్డును బద్దలు కొట్టింది. ఆరు ఓవర్లు ముగిసే సమయానికి, హెడ్ 26 బంతుల్లో 84, అభిషేక్ శర్మ 10 బంతుల్లో 40 సాధించారు. తర్వాత, అభిషేక్ 12 బంతుల్లో 46 (2x4, 6x6) ఔట్ కాగా, హెడ్ 32 (11x4, 6x6) 89 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. IPL చరిత్రలో అత్యంత వేగవంతమైన 100 పరుగుల మార్క్ ను కూడా
SRH సాధించింది. హెడ్ -అభిషేక్ కేవలం ఐదు ఓవర్లలో SRHని 100/0కి తీసుకెళ్లారు. మొదటి 10 ఓవర్ల తర్వాత హైదరాబాద్ ఫ్రాంచైజీ ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ స్కోరును సాధించింది. SRH 10 ఓవర్లలో 158/4తో రికార్డు నెలకొల్పింది, ఈ సీజన్ ప్రారంభంలో హైదరాబాద్ తన పేరుపై సాధించిన రికార్డును తానే బద్దలు కొట్టింది.
IPLలో అత్యధిక పవర్‌ప్లే స్కోర్లు
125/0 - SRH vs DC, 2024
105/0 - KKR vs RCB, 2017
100/2 - CSK vs PBKS, 2014
90/0 - CSK vs MI, 2015
88/1 - KKR vs DC, 2024
ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన జట్టు సెంచరీలు
5 ఓవర్లు - SRH vs DC, ఢిల్లీ, 2024
6 ఓవర్లు - CSK vs PBKS, ముంబై, 2014
6 ఓవర్లు - KKR vs RCB, బెంగళూరు, 2017
6.5 ఓవర్లు - CSK vs MI, ముంబై WS, 2015
7 ఓవర్లు - SRH vs MI, హైదరాబాద్, 2024
ఐపీఎల్‌లో తొలి 10 ఓవర్ల తర్వాత అత్యధిక స్కోర్లు
158/4 - SRH vs DC, ఢిల్లీ, 2024
148/2 - SRH vs MI, హైదరాబాద్, 2024
141/2 - MI vs SRH, హైదరాబాద్, 2024
135/1 - KKR vs DC, విశాఖపట్నం, 2024

Read More
Next Story