మహాకుంభమేళాలో తొక్కిసలాట-17 మంది మృతి
x

మహాకుంభమేళాలో తొక్కిసలాట-17 మంది మృతి

త్రివేణీ సంగమం ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 17 మంది మరణించారు. మరో 70 మంది గాయపడ్డారు.


ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళాలో అపశ్రుతి చోటు చేసుకుంది. త్రివేణీ సంగమం ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 17 మంది మరణించారు. మరో 70 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భక్తులు చెబుతున్నారు. గాయపడిన వారిని సమీపంలోని సెంట్రల ఆస్పత్రికి తరలించారు.
మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు సంగమం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల తాకిడికి బారికేడ్లు విరగడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సుమారు 17 మంది మృతిచెందినట్లు సమాచారం.
మౌని అమావశ్యనాడు దేవతలు స్వయంగా భూమిపైకి దిగివచ్చి భక్తుల తపస్సును ఆశీర్వదిస్తారనేది నమ్మకం. ఇక్కడే మహాకుంభమేళా సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరిస్తే జీవితం ధన్యమవుతుందనేది భక్తుల విశ్వాసం. అందుకు ప్రధానంగా గంగ, యమునా, సరస్వతి సంగమ ప్రదేశం హిందూ దేవలతో పవిత్రత ముడిపడి ఉంది. ఈ ఒక్కరోజే పది కోట్ల మంది గంగానదిలో స్నానం చేస్తారని యూపీప్రభుత్వం అంచనా వేసింది. అందుకు తగ్గ ఏర్పాటు చేసినప్పటికి కూడా భక్తుల తాకిడి ఒక్కసారిగా పెరగడంతో తొక్కిసలాట జరిగినట్టు ప్రత్యక్ష సాక్షుల కథనం.
పుణ్యస్నానాలు చేయడానికి ముందు పితృదేవతలకు తర్పణం చేయడం పవిత్రంగా భావించి భారీగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగినట్టు ఘటనా స్థలంలో ఓ వైద్యుడు చెప్పినట్లు జాతీయ మీడియా పేర్కొంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. మరోవైపు పలువురు భక్తులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సిబ్బంది వారిని అంబులెన్సుల్లో సమీప ఆస్పత్రులకు తరలించారు.
యోగి ఆదిత్యనాథ్‌కు ప్రధాని మోదీ ఫోన్‌
కుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ ఆరా తీశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఫోన్‌ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
భక్తుల తొక్కిసలాటతో ఈ ప్రాంతం బీభత్సంగా ఉంది.
Read More
Next Story