బలహీనంగా ఉన్నా, పాక్ నుంచి ఇప్పటికీ ముప్పే
x
సీడీఎస్ అనిల్ చౌహాన్

'బలహీనంగా ఉన్నా, పాక్ నుంచి ఇప్పటికీ ముప్పే'

ఆర్థికంగా బలహీనంగా ఉందని శత్రువుని తక్కువగా అంచనా వేయద్దని సీడీఎస్ అనిల్ చౌహాన్ అంటున్నారు.


పాకిస్తాన్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం లో ఉన్నప్పటికీ దాని నుంచి భారత సైన్యానికి ఇంకా ముప్పు తొలగిపోలేదని సీడీఎస్ అనిల్ చౌహన్ అభిప్రాయపడ్డారు. సైనిక పరంగా పాకిస్తాన్ బలహీనంగా లేదని ఆయన వివరించారు. ఇండియా టుడే కాంక్లేవ్ లో జరిగిన చర్చ సందర్బంగా సీడీఎస్ మాట్లాడారు. దేశ ఉత్తర సరిహద్దులో సైన్యం కనురెప్ప వాల్చకుండా పహరా కాస్తోందని చెప్పారు. దేశానికి కాపాడుకోవడానికి అన్ని వనరులు ఉన్నాయని వివరించారు. 21 వ శతాబ్దంలో భారత్ ఎదుర్కొనే అతిపెద్ద భద్రతా సవాల్లు ఏమిటనే ప్రశ్న ఎదురైనప్పుడు సీడీఎస్ ఈ విషయాలను పేర్కొన్నారు.

" నా ఉద్దేశంలో భారత్ కు అతిపెద్ద సవాల్ సరిహద్దు అవల నుంచే ఉంది. అయితే ఇలాంటి సవాల్లు ఏకమయినప్పుడు దేశం మొత్తం ఏకం అయింది. ఇదే విషయాన్ని కార్గిల్, గల్వాన్ సందర్భంగా మనం చూశాం." అని సీడీఎస్ ప్రస్తావించారు.
చైనా తో కూడా
చైనాతో సైనిక ముప్పు సమస్య ఎక్కువగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికీ సరిహద్దు సమస్య శాశ్వతంగా పరిష్కారం కాకపోవడం ఒక సమస్యని ఆయన అభిప్రాయపడ్డారు. మన పొరుగున ఉన్న ఇద్దరు శత్రువులు గాఢంగా స్నేహం చేస్తున్నారని, పైగా ఇరు దేశాలు కూడా అణు సామర్థ్యం దేశాలని పరోక్షంగా చైనా, పాకిస్తాన్ లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ రాజకీయంగా, ఆర్థికంగా బలహీనంగా ఉన్పప్పటికీ దాని సైనిక సామర్థ్యం మాత్రం బలహీనంగా లేదని అదను కోసం ఎదురుచూస్తోందని అన్నారు.
యుద్దం తీరు మారింది
ప్రపంచం ఎప్పటికప్పుడు మారుతూనే ఉంది. అలాగే యుద్ద రీతులు సైతం మారుతూనే ఉన్నాయి. కానీ భద్రతా దళాలకు ఇదే పెద్ద సవాల్. కాలానికి అనుగుణంగా కొత్త ఆయుధ వ్యవస్థలను ప్రవేశపెట్టడం, చాలా శ్రమ ఖర్చుతో కూడుకున్నది. అలాగే సాంకేతిక పరిజ్ఞానం కూడా పెంచుకోవాలని ఆయన పేర్కొన్నారు.
ఈ మధ్య భారత్ పోఖ్రాన్ లో భారత్ శక్తి పేరిట యుద్ద విన్యాసాలు నిర్వహించింది. ఇందులో భారత్ స్వదేశంగా తయారు చేసిన ఆయుధాలను ప్రయోగించింది. ఇందులో సైనికాధికారులతో పాటు విదేశీ ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ విన్యాసాలను సీడీఎస్ కూడా వీక్షించారు. ఇది జరిగిన రెండు రోజులకు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


Read More
Next Story