‘వికసిత భారత్‘ సందేశాలు ఆపండి: ప్రభుత్వానికి ఈసీ ఆదేశం
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి కేంద్ర ప్రభుత్వం ఓటర్లకు పంపుతున్న వాట్సాప్ సందేశాలను నిలిపివేయాలని ఈసీ ఆదేశించింది.
వికసిత్ భారత్ సంపర్క్ కింద బల్క్ వాట్సాప్ సందేశాలు పంపుతున్న కేంద్ర ప్రభుత్వం పై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక నుంచి వీటిని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. ఈ విషయంపై ఫిర్యాదులు అందడంతో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
"ఈ చర్య క్షేత్ర స్థాయిలో ఓటర్లపై ప్రభావితం చూపే అంశం కావడంతో ఈ నిషేధాన్ని విధించామని" అని EC తెలిపింది.అలాగే మంత్రిత్వ శాఖ నుంచి ఈ విషయంపై నివేదికను కూడా కోరింది.
మార్చి 16 నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) అమల్లోకి రాకముందే ప్రధాని నరేంద్ర మోడీ లేఖతో పాటు సందేశాలు పంపినట్లు మంత్రిత్వ శాఖ కమిషన్‌కు నివేదించింది.
"వ్యవస్థాగత, నెట్‌వర్క్ పరిమితుల కారణంగా వాటిలో కొన్ని వినియోగదారులకు ఆలస్యంగా అంది ఉండవచ్చు" అని మంత్రిత్వ శాఖ కమిషన్‌కు ఒక కమ్యూనికేషన్‌లో తెలిపింది.
సార్వత్రిక ఎన్నికలు 2024 , ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చినప్పటికీ, ప్రభుత్వ కార్యక్రమాలను హైలైట్ చేసే ఇటువంటి సందేశాలు ఇప్పటికీ పౌరుల ఫోన్‌లలో పంపిణీ చేయబడుతున్నాయని పోల్ అథారిటీకి అనేక ఫిర్యాదులు అందాయి.
కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ (TMC) సందేశంపై అభ్యంతరాలు లేవనెత్తాయి మోడల్ ప్రవర్తనా నియమావళికి విరుద్దంగా ప్రవర్తిస్తున్న వారిపై చర్య తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరాయి.
Next Story