తాగి వస్తున్నాడని..టీచర్ పైకి చెప్పులు విసిరిన విద్యార్థులు..
x

తాగి వస్తున్నాడని..టీచర్ పైకి చెప్పులు విసిరిన విద్యార్థులు..

బడికి తాగి రావడం, తరగతి గది నేలపైనే పడకేయడం చూసిన విద్యార్థులు ఆ ఉపాధ్యాయుడికి బుద్ధి చెప్పాలనుకుని ఏం చేశారంటే..


పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాలిన గురువు తప్పతాగి పాఠశాలకు రావడం మొదలుపెట్టాడు. తాగిన మైక్యంలో తరగతి గదిలో నేలపైన పడుకోవడం చూసిన విద్యార్థులు ఆ ఉపాధ్యాయుడి తీరుపై విసిగెత్తిపోయారు. తీరా ఓ రోజు ఏం చేశారంటే..

మద్యం మత్తులో పాఠశాలకు వచ్చిన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిని విద్యార్థులు తరిమికొట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు. వీడియోలో కనిపిస్తున్న పరిసరాలను బట్టి ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డెవలప్‌మెంట్ బ్లాక్‌ పల్లిభటా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలగా గుర్తించారు. ఈ ఘటనపై ఇప్పటికే స్థానిక బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (బీఈవో) విచారణ ప్రారంభించారని బస్తర్ కలెక్టర్ కె.విజయ్ దయారామ్ తెలిపారు. విచారణ నివేదిక ఆధారంగా సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.


పాఠశాల ఆవరణలో కొందరు విద్యార్థులు చెప్పులు విసరడంతో ఉపాధ్యాయుడు తన బైక్‌పై తప్పించుకుపోతున్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. సదరు ఉపాధ్యాయుడు పాఠాలు చెప్పకపోగా తరగతి గదిలో నేలపై పడుకునేవాడని, క్లాస్ తీసుకోమని అడిగిన పిల్లలను దుర్భాషలాడేవాదని విద్యార్థులు చెబుతున్నారు. చివరకు అతడిని తరిమికొట్టేందుకు విద్యార్థులు ఇలా చేశారు.

Read More
Next Story