సుదర్శన్ రెడ్డి ఇంటర్వ్యూ: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో నేను గెలుస్తాను
x
ప్రతిపక్ష అభ్యర్థి సుదర్శన్ రెడ్డి

సుదర్శన్ రెడ్డి ఇంటర్వ్యూ: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో నేను గెలుస్తాను

గెలవకపోతేనే ఆశ్చర్యపోతానన్నా ప్రతిపక్ష అభ్యర్థి


ఉబీర్ నక్షాబందీ

దేశంలో ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా, జార్ఖండ్ మాజీ ఎంపీ, గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బరిలో ఉండగా, ప్రతిపక్షాలు తమ అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డిని నిలబెట్టాయి. ప్రస్తుతం పార్లమెంట్ లో ఎన్డీఏ అభ్యర్థికి అనుకూలంగా సంఖ్యలు ఉన్నాయి. ఈ ఎన్నికను ఎక్కువగా భావజాల యుద్ధంగా పిలుస్తున్నారు.
ఎన్నికలకు ముందు సుదర్శన్ రెడ్డి ‘ది ఫెడరల్’ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2011 లో సల్వాజుడుం తీర్పుపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
అధికార బీజేపీ తనను అప్రతిష్ట పాలు చేయడానికి ఈ అంశాన్ని ఉపయోగించుకుందని ఆయన ఆరోపించారు. 79 సంవత్సరాల వయస్సులో ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాలని అనుకున్నారు? ఉపాధ్యక్ష పదవి ఎందుకు రాజకీయ జీవితానికి నాంది కాదో కూడా ఆయన మాట్లాడారు.
ఎన్నికలు రేపు జరుగుతున్నాయి. నెంబర్లు మీకు వ్యతిరేకంగా ఉన్నాయి. ట్రెజరీ, ప్రతిపక్ష బెంచ్ లలోని ఎంపీలు మనస్సాక్షికి అనుగుణంగా ఓటు వేయాలని మీరు విజ్ఞప్తి చేశారు. ఫలితాలు మీరు ఆశించినట్లు ఉంటాయని అనుకుంటున్నారా?
నేను నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి తీర్పు నాకు అనుకూలంగా వస్తుందని నేను గట్టి నమ్మకంతో ఉన్నాను. ఫలితం నాకు అనుకూలంగా వచ్చినా నేను ఆశ్చర్యపోను. అది వేరే విధంగా జరిగితేనే నాకు ఆశ్చర్యం.
20 రోజుల ప్రచారంలో మీ అభ్యర్థిత్వం దేనిని సూచిస్తుందో మీరు మాట్లాడటం మేము విన్నాం. మీ సల్వాజుడుం తీర్పుపై హోంమంత్రి అమిత్ షా ఆరోపణలు చేశారు. ఇది మీకు ఇబ్బంది కలిగిస్తుందా?
కారణం చాలా సులభం. అమిత్ షా, నాపై ఎలాంటి తప్పుడు ఆరోపణలు చేయలేదు. ఆయన చేసిన వ్యాఖ్య కొంత వివరణ ఆధారంగా తీర్పును అర్థం చేసుకోవాలి. 14 సంవత్సరాల తరువాత సుప్రీంకోర్టు తీర్పు గురించి మాట్లాడటంలో అర్థం లేదు.
ఏ కారణం చేతనైనా దాని గురించి చర్చను లేవనెత్తడానికి ప్రయత్నించారు. కానీ అది విఫలమైంది. నేను దాని గురించి ఇంకేమి మాట్లాడాలని అనుకోవడం లేదు.
మీ సల్వాజుడుం తీర్పుపై విమర్శలు వచ్చినప్పుడు ప్రతిపక్షాలు మీకు మద్దతు ఇచ్చాయి. కాంగ్రెస్, వామపక్షాలు ముందుకు వచ్చాయి. కానీ టీఎంసీ, నేషనలిస్ట్ కాంగ్రెస్, ఎస్పీ వంటి పార్టీలు మరింత గట్టిగా మిమ్మల్ని ఎందుకు సమర్థించలేదు?
ఇది చాలా విడ్డూరం. తీర్పు వెలువడినప్పుడూ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుత గౌరవనీయ మంత్రి గారు 14 సంవత్సరాల తరువాత మాట్లాడారు. వీరు పదకొండు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు.
నేను దాని గురించి ఏం మాట్లాడాలని అనుకోవడం లేదు. నేను ఆశ్చర్య పోలేదు. ఆందోళన చెందలేదు. గౌరవనీయమైన మంత్రి(అమిత్ షా) చేసిన ప్రకటన గురించి నేను ఒక్క క్షణం కూడా కలవరపడలేదు.
ప్రతిపక్షాల తరఫున మీరు పోటీ చేయడాన్ని చాలామంది ఆశ్చర్యకరంగా చూశారు? 79 ఏళ్ల వయస్సులో ఎలాంటి రాజకీయ లేదా పార్లమెంటరీ నేపథ్యం లేకుండా ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని మీరు ఎలా నిర్ణయించుకున్నారు? పోటీ చేయమని మీకు ఆఫర్ ఇచ్చింది ఎవరూ? దానిని కొంచెం వివరిస్తారా?
కొంతమంది ఉన్నత స్థానాల్లో బాధ్యతాయుతమైన వ్యక్తులు ఆఫర్ ఇచ్చారు.
వారి పేర్లు చెప్పగలరా?
లేదు చెప్పలేను. నేను వారి పేర్లను ఎందుకు చెప్పాలి? వారు నాతో మాట్లాడారు. నాకు సమయం ఇవ్వండి నేను దాని గురించి ఆలోచిస్తానని చెప్పాను. తరువాత నేను కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసే ప్రశ్నే లేదని వారితో చెప్పాను.
నా అభ్యర్థిత్వాన్ని అన్ని ప్రతిపక్ష పార్టీలు ఆమోదించినట్లయితే నేను దానిని పరిశీలిస్తానని చెప్పాను. తరువాత రోజు మొత్తం ఇండి కూటమి నా పేరు ఏకగ్రీవంగా ఆమోదించిందని సమాచారం అందింది.
కానీ నేను నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లే ముందు కేజ్రీవాల్ నుంచి పిలుపు వచ్చింది. ఆయన నన్ను చూడాలని కోరుకున్నారు. నేను వెళ్లి ఆయనతో చర్చించాను.
ఆయన నిర్ణయం తీసుకుని ఆప్ నా అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తుందని ప్రకటించారు. కాబట్టి ఇండి కూటమిల భాగం కానీ పార్టీ నాకు మద్దతు ఇవ్వడానికి అంగీకరించింది. కొంతమంది స్వతంత్రులు నాకు మద్దతు ఇచ్చారు. వారి పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. ఇలా అందరి మద్దతుతో ప్రతిపక్షాల అభ్యర్థిని అయ్యాను.
ఎలక్టోరల్ కాలేజీలో సంఖ్యాబలం సీపీ రాధాకృష్ణన్ అనుకూలంగా ఉందో ప్రతిపక్షానికి తెలుసు. ఇది సైద్దాంతిక యుద్దం అని కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రకటించారు. ఏకాభిప్రాయంతో జరిగే దానిని మీ రాకతో ఎన్నికగా మారింది. మీరు ఈ విషయం ప్రజలకు తెలియజేయగలిగారని అనుకుంటున్నారా?
భారత ఉప రాష్ట్రపతి పదవి రాజకీయమైనది. అది ఒక ఉన్నత రాజ్యాంగ పదవి. పక్షపాత రాజకీయాలకు అది అతీతంగా ఉండాలనే ఆలోచనను నేను విజయవంతంగా తెలియజేశాను.
భారత తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఏ రాజకీయ పార్టీతో సంబంధం పెట్టుకోలేదు. ఆయన ప్రముఖ విద్యావేత్త, తత్వవేత్త. ఉప రాష్ట్రపతి కాకముందు వివి గిరి గుర్తింపు పొందిన ట్రేడ్ యూనియన్ నాయకుడు. డాక్టర్ కే నారాయణన్ ఒక ప్రముఖ దౌత్యవేత్త.
హమీద్ అన్సారీ ఒక విద్యావేత్త, దౌత్యవేత్త. అందువల్ల ఉపరాష్ట్రపతి పదవిని రాజకీయాలను అతీతంగా ఉన్న ప్రముఖ వ్యక్తులు అధిష్టించిన గొప్ప సంప్రదాయం ఉంది. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ హిదయతుల్లా గురించి నేను మాట్లాడకపోతే నా విధుల్లో విఫలమవుతాను.
ఆయన రాజ్యసభ ఉపాధ్యక్షుడు, చైర్మన్. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న దానిలో కొత్తగా ఏమి లేదు. ఉప రాష్ట్రపతి పదవిని రాజకీయా నాయకుల కంటే దాని నేపథ్యం లేని వ్యక్తులే అధిష్టించారు.
ఫలితాల తరువాత మీరు ఏం చేస్తారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎన్నికలలో లేదా ఇతరత్రా రాజకీయాలలో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం ఉందా? ఎన్నికల తరువాత అవకాశాల గురించి ఏదైనా ప్రతిపక్ష పార్టీ మీతో చర్చించిందా?
అలాంటి ప్రశ్నే ఉత్పన్నం కాదు.
కాబట్టి మీరు రాజకీయాల్లోకి రారు?
నేను ఏ పార్టీలో చేరను. నేను ప్రజాస్వామ్య ప్రక్రియలను దూరంగా ఉంటానని చెప్పను. నేను ఈ దేశ పౌరుడిని, ఓటర్ ను, భారత రాజ్యాంగం పై శాశ్వత విశ్వాసం ఉన్న సాధారణ వ్యక్తిని.
నేను రాజకీయేతర వ్యక్తినని చెబితే అది తప్పుడు ప్రకటన అవుతుంది. నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాను. కానీ దేశంలో రాజకీయ ప్రక్రియలు, ప్రజాస్వామ్య ప్రక్రియల గురించి నాకు ఎటువంటి అభిప్రాయం లేదని చెప్పను. అవసరమైన చోట ఎప్పుడైనా నేను నా గళాన్ని వినిపిస్తాను. కానీ ఏ పార్టీలో మాత్రం చేరను. అది కచ్చితంగా హమీ ఇవ్వగలను.
Read More
Next Story