రాజ్యసభకు సుధా‌మూర్తి
x

రాజ్యసభకు సుధా‌మూర్తి

ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్‌పర్సన్ సుధా మూర్తి శుక్రవారం (మార్చి 8) రాజ్యసభకు నామినేట్ అయ్యారు.


ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్‌పర్సన్ సుధా మూర్తి శుక్రవారం (మార్చి 8) రాజ్యసభకు నామినేట్ అయ్యారు. భారత రాష్ట్రపతి ముర్ము సుధామూర్తిని రాజ్యసభకు నామినేట్ చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. మహిళా శక్తికి ఇది బలమైన ఉదాహరణ అని అభిప్రాయపడ్డారు. విభిన్న రంగాలకు ఆమె చేసిన కృషిని ప్రధాని మోదీ ఎక్స్‌లో ప్రశంసించారు. ‘‘ సుధా జీ సామాజిక సేవ, దాతృత్వం, విద్య వంటి వివిధ రంగాలకు గణనీయమైన, స్ఫూర్తిదాయకమైన సహకారాన్ని అందించారు. ఆమె రాజ్యసభలో ఉండటం మన దేశ భవిష్యత్తును నిర్మించడంలో మహిళల శక్తి, సామర్థ్యాన్ని తెలియజేస్తుంది.’’ అని ఎక్స్‌లో మోదీ పేర్కొన్నారు.

మూర్తి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య, బ్రిటిష్ ప్రధాన మంత్రి రిషి సునక్ అత్త కూడా. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున నామినేట్ అయిన 73 ఏళ్ల సుధామూర్తిని 2006లో పద్మశ్రీ, 2023లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించారు.

Read More
Next Story