ఎస్ సి రిజర్వేషన్ల వర్గీకరణకు సుప్రీమ్ కోర్టు ఆమోదం
x

ఎస్ సి రిజర్వేషన్ల వర్గీకరణకు సుప్రీమ్ కోర్టు ఆమోదం

ఎట్టేకేలకు ఫలించిన ఎస్ సి వర్గీకరణ ఉద్యమం


ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సుప్రీంకోర్టు ఓకె చేసింది. వర్గీకరణ సమర్థ నీయమేనని గురువారం నాడు తీర్పు చెప్పింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి వై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు మెజారిటీ తీర్పు నించింది. ధర్మాసనంలో న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, విక్రమ్ నాథ్, బేలా ఎం త్రివేధి, పంకజ్ మిథల్, మనోజ్ మిశ్రా, సతీశ్ చంద్రశర్మ ఉన్నారు. మెజారిటి సభ్యుల తీర్పుతో జస్టిస్ బేలా ఏకీభవించలేదు. ఆయన ప్రత్యేకంతా డిసెంట్ తీర్పు నిచ్చారు.

గతంలో రిజర్వేషన్లను ప్రతిపాదించేటపుడు ఎస్ సి లనందరిని ఒకే సమూహంగా చూశారని, అందువల్ల మళ్లీ ఈ రిజర్వేషన్ల వర్గీకరణ సబబు కాదని చెబుతూ 2005లో జస్టిస్ ఇవి చిన్న య్య ఇచ్చిన తీర్పును (E.V.Chinnaiah v. State of Andhra Pradesh, (2005) 1 SCC 394) సుప్రీమ్ కోర్టు ఈ రోజు కొట్టి వేసింది.

ఎస్ సిలో బాగా వెనకబడిన వారికి మేలు చేకూర్చేలా రిజర్వేషన్ల ను వర్గీకరించడం సబబేనని సుప్రీంకోర్టు పేర్కొంది.


Read More
Next Story