ఆప్ చీఫ్ కేజ్రీవాల్‌కు బెయిల్‌ వస్తుందా?
x

ఆప్ చీఫ్ కేజ్రీవాల్‌కు బెయిల్‌ వస్తుందా?

మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించే అవకాశం ఉంది.


మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించే అవకాశం ఉంది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో ఆయనను మార్చి 21న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం తనను విడుదల కావాలని కేజ్రీవాల్ వేసిన పిటిషన్ ను న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారించి తీర్పును రిజర్వ్ చేసింది. ప్రస్తుతం కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీలో తీహార్ జైలులో ఉన్నారు.

తన అరెస్టుపై కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం రెండు భాగాలుగా విభజించి విచారించింది. కేంద్ర దర్యాప్తు సంస్థ తనను అరెస్టు చేయడాన్ని "చట్టవిరుద్ధం"గా ప్రకటించాలన్నది మొదటి అంశం కాగా, ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం రెండో అంశం.

ఢిల్లీ హైకోర్టు ఏప్రిల్ 9 న ఆప్ చీఫ్ అరెస్టును సమర్థించింది. అందులో చట్టవిరుద్ధమని లేదని పేర్కొంది. మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని మే 20 వరకు పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ ఈడీ గురువారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. చట్టాలు అందరికీ సమానమేనని, లోక్‌సభ ఎన్నికలకు ప్రచారం చేయడం ప్రాథమిక, రాజ్యాంగబద్ధమైన లేదా చట్టబద్ధ హక్కు కాదని పేర్కొంది. ప్రచారం కోసం ఏ రాజకీయ నాయకుడికి గతంలో బెయిల్ మంజూరు కాలేదని దర్యాప్తు సంస్థ పేర్కొంది.

ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలకు మే 25న ఓటింగ్ జరగనుంది.

Read More
Next Story