చంద్రబాబుపై సుప్రీం తీర్పు - ఏపీలో ట్వీ(తి)ట్ల పర్వం
x

చంద్రబాబుపై సుప్రీం తీర్పు - ఏపీలో ట్వీ(తి)ట్ల పర్వం

స్కిల్‌ డెవల్‌మెంట్‌ కేసులో అంబటి రాంబాబు చంద్రబాబును ఉద్దేశించి..నేరస్తుడిని ఏ న్యాయస్థానం కాపాడదు అని ట్వీట్‌ చేస్తే టీడీపీ నేత సోమిరెడ్డి రీ కౌంటర్ ఇచ్చారు.


స్కిల్‌ డెవల్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఏటూ తేల్చలేక చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌కి ఈ కేసును రిఫర్‌ చేసింది. దానిపై రాజ్యాంగ ధర్మాసనం మళ్లీ విచారించి తీర్పు ఇస్తుంది. అయితే ఇప్పుడొచ్చి తీసుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఎలాంటి ఊరట లభించలేదంటున్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. 17ఏ సెక్షన్ అమల్లోకి రాకముందే స్కిల్ స్కామ్‌ కేసు ఉందన్నారు. అరెస్ట్ చేసిన తీరును విమర్శిస్తున్నారు తప్పా.. తాము తప్పు చేయలేదని ఎక్కడ మాట్లాడడం లేదన్నారు మంత్రి అమర్నాథ్. 2015లో ఓటుకు నోటు కేసులో చంద్రబాబు దొరికినప్పుడు సెక్షన్ 8 అమల్లో ఉందని తప్పిచ్చుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నమే చేస్తున్నారని విమర్శించారు. ప్రజా కోర్టులో చంద్రబాబుకు శిక్షతప్పదంటున్నారు మంత్రి అమర్నాథ్. తమకనుకూలమంటే తమకు అనుకూలమని అటు వైసీపీ, ఇటు టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. అంతటితో ఆగకుండా ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టుకుంటున్నారు. అందులో అసభ్య పదజాలాన్నీ వాడుతున్నారు. ఏదిఏమైనా ప్రస్తుతం ఏపీలో ట్వీట్ల వార్‌ నడుస్తోంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతలు ఈ తీర్పును.. ఎవరికి వారు అన్వయించుకుంటూ.. ట్వీట్లు చేసుకుంటున్నారు.

నేరస్తుడిని ఏ కోర్టూ కాపాడదు...

టీడీపీ అధినేత చంద్రబాబుపై రాష్ట్రమంత్రి అంబటి రాంబాబు సెటైర్‌ వేశారు. నేరస్తుడిని ఏ న్యాయస్థానం కాపాడదు అని సోషల్‌ మీడియా ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. నేరస్తుడిని అనే పదానికి కోట్స్ పెట్టి మరీ ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌ను చంద్రబాబుకు ఎటాచ్‌ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఇవాళ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అంబటి ఈ ట్వీట్‌ చేశారు. ద్విసభ్య ధర్మాసనంలో.. భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంపై టీడీపీ, వైసీపీ నేతలు.. ఎవరికి తోచినట్టు వాళ్లు తీర్పును అన్వయించుకుంటున్నారు. టీడీపీకి పాక్షిక విజయం లభించిందని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్న సమయంలో అంబటి.. నేరస్తుడిని ఏ న్యాయస్థానం కాపాడదు అని ట్వీట్‌ చేశారు.

సోమిరెడ్డి కౌంటర్‌ ట్వీట్‌....

మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబును ఉద్దేశించి.. నేరస్తుడిని ఏ న్యాయస్థానం కాపాడదు అని ట్వీట్‌ చేస్తే దానికి టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అదేంటో మా సంబరాల రాంబాబు అప్పుడప్పుడూ నిజాలే చెబుతాడని సెటైర్‌ వేశారు. అంతటితో ఆగకుండా.. వైసీపీ అధినేత జగన్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ... 32 కేసులు, 16 నెలల జైలు జీవితం, పదేళ్లుగా బెయిల్‌.. ఇవన్నీ తప్పించుకోలేరుగా అని సోమిరెడ్డి ట్వీట్‌ పోస్ట్‌ చేశారు. ఆ పోస్టును అంబటి రాంబాబుకు టాగ్‌ చేశారు.



అదేంటి జగన్‌ అంతమాటేనేశాడు...

ఇదే విషయమై టీడీపీ నేత ఎన్‌.అమర్నాథ్‌ రెడ్డి మరో అడుగు ముందుకేస్తూ ఇంకో ట్వీట్‌ చేశారు. ఈ పోస్ట్‌ను నేరుగా జగన్‌కు టాగ్‌ చేశారు. అదేంటి జగన్‌.. ఈ అంబటి నిన్ను అంతమాట అనేశాడు అని ట్వీట్‌ చేశారు. అందులో అభ్యంతరకమైన ఆంబోతు అనే పదాన్నీ వాడురు అమర్నాథ్‌రెడ్డి. ఆ ట్వీట్‌లో జగన్‌ కటకటాల వెనకున్న ఫోటోలను అటాచ్‌ చేశారు. వాటిపైన కామెంట్లు రాశారు అమర్నాథ్‌రెడ్డి.

బాబు సంగతి మాకు తెలుసులే..

సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఎలాంటి ఊరట లభించలేదంటున్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. 17ఏ సెక్షన్ అమల్లోకి రాకముందే స్కిల్ స్కామ్‌ కేసు ఉందన్నారు. అరెస్ట్ చేసిన తీరును విమర్శిస్తున్నారు తప్ప.. తాము తప్పు చేయలేదని ఎక్కడ మాట్లాడడం లేదన్నారు మంత్రి అమర్నాథ్. 2015లో ఓటుకు నోటు కేసులో చంద్రబాబు దొరికినప్పుడు సెక్షన్ 8 అమల్లో ఉందని తప్పిచ్చుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నమే చేస్తున్నారని విమర్శించారు. ప్రజా కోర్టులో చంద్రబాబుకు శిక్షతప్పదంటున్నారు మంత్రి అమర్నాథ్.

టీడీపీకి పాక్షిక విజయమే...

వ్యవస్థలపై టీడీపీకి పూర్తి నమ్మకం ఉందన్నారు మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు. సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పు పాక్షిక విజయంగా భావిస్తున్నామన్నారు. రాజకీయ ప్రేరిపిత కేసు కాబట్టి ...టీడీపీకి పూర్తి న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు ఆనంద బాబు. సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ బెంచ్ లో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని, తీర్పు ఆలస్యం కావచ్చు కానీ కచ్చితంగా న్యాయం లభిస్తుందన్నారు. కేసలకు టీడీపీ భయపడే ప్రసక్తే లేదన్నారు. అడ్వకేట్ జనరల్ వైసీపీ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు నక్కా ఆనందబాబు.

Read More
Next Story