‘‘అధికారంలోకి వస్తే ఆ రెండింటిపై సర్వే’’
x

‘‘అధికారంలోకి వస్తే ఆ రెండింటిపై సర్వే’’

తమ పార్టీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన, ఆర్థిక సర్వే నిర్వహిస్తామని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తెలిపారు.


తమ పార్టీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన, ఆర్థిక సర్వే నిర్వహిస్తామని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తెలిపారు. ఉత్తర గుజరాత్‌లోని పటాన్ పట్టణంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు.

"దేశ జనాభాలో తొంభై శాతం మంది ఎస్సీలు, ఎస్టీలు, OBCలు ఉన్నారు. కానీ ఈ వర్గాలకు చెందిన ప్రతినిథులు కార్పొరేట్, మీడియా (సెక్టార్లు), ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు లేదా ప్రభుత్వంలో ఎక్కడా కనిపించరు. రిజర్వేషన్ వ్యవస్థకు పాలకవర్గం వ్యతిరేకమని చెబుతూ..మమ్మల్ని గెలిపిస్తే మొదట కులగణన, తర్వాత ఆర్థిక సర్వే చేస్తామని చెప్పారు.

అధికారంలో ఉన్న బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ రాజ్యాంగాన్ని మార్చే యోచనలో ఉన్నాయని గాంధీ ఆరోపించారు. దేశంలో నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకుందని వాయనాడ్ ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు. పటాన్ లోక్‌సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి చందంజీ ఠాకూర్‌కు మద్దతుగా జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు.

Read More
Next Story