టీ20 ప్రపంచకప్ 2024 టికెట్ల అమ్మకాలు: భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కు ..
x

టీ20 ప్రపంచకప్ 2024 టికెట్ల అమ్మకాలు: భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కు ..

యూఎస్ఏ, వెస్టిండీస్ వేదిక గా జరగనున్న మెన్స్ టీ20 ప్రపంచ కప్ కు టికెట్ల అమ్మకాలు ప్రారంభం అయ్యాయని ఐసీసీ ప్రకటించింది. అయితే ప్రస్తుతం కరేబియన్ దీవుల్లో..


టీ20 ప్రపంచకప్ టికెట్ అమ్మకాలు ప్రారంభించినట్లు ఐసీసీ ప్రకటించింది. టిక్కెట్ లను tickets.t20worldcup.com లో కొనుగోలు చేయవచ్చని వెల్లడించింది. కాగా జూన్ 9న న్యూయార్క్ వేదికగా జరగనున్న భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కు భారీగా డిమాండ్ ఉన్నట్లు ఐసీసీ ప్రకటించింది. ఈ మ్యాచ్ కు 200 సార్లు కంటే ఎక్కువ ఓవర్ సబ్ స్క్రైబ్ చేయబడిందని ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

టీ20 క్రికెట్ కోసం పినాకిల్ గ్లోబల్ ఈవెంట్ కోసం 161 దేశాల నుంచి 3 మిలియన్లకు పైగా టిక్కెట్ దరఖాస్తులు వచ్చినట్లు ఐసీసీ తెలిపింది. అమెరికాలో షెడ్యూల్ చేయబడిన మ్యాచ్ లకు మాత్రం ప్రస్తుతం టికెట్లు అందుబాటులో లేవని పేర్కొంది.
అలాగే బార్బోడోస్, సెయింట్ విన్సెంట్ గ్రెనడైన్స్ లో జరిగే రెండు సూపర్ ఎయిట్ మ్యాచ్ లకు అలాగే ఫైనల్, సెమీ ఫైనల్ జరిగే మ్యాచ్ లకు కూడా ఓవర్ సబ్ స్క్రైబ్ చేయబడ్డాయని తెలిపింది. ప్రస్తుతం వెస్టీండీస్ వేదికగా జరిగే మ్యాచ్ లకు మాత్రమే టికెట్లు అందుబాటులో ఉన్నాయని ఐసీసీ ప్రకటించింది. వరల్డ్ కప్ కౌంట్ డౌన్ కు 100 రోజులు ఉంది. జూన్ 1-29 వరకూ వెస్టిండీస్, యూఎస్ఏ లో ఈ ప్రపంచకప్ జరగనుంది.
ప్రయాణ ప్యాకేజీలు
మెన్స్ టీ20 ప్రపంచ కప్ కోసం ఐసీసీ కొన్ని టూర్ ప్యాకేజ్ లను సైతం ప్రకటించింది. ఐసీసీ ట్రావెల్స్ అండ్ టూర్స్ వివిధ దేశాలలో నియమించబడిన అధికారిక ఏజెంట్ల ద్వారా టికెట్లు కలుపుకుని ఉత్తమ ప్రయాణ ప్యాకేజీలను పొందవచ్చని వీటి కోసం www.icctravelandtours.comని సందర్శించాలని ఐసీసీ కోరింది.
ఐసీసీ శుక్రవారం ‘అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్’ పేరుతో ప్రచారం ప్రారంభించింది. ఇందులో టీ20 సూపర్ స్టార్లు క్వింటన్ డికాక్, కీరన్ పొలార్డ్, మార్కస్ స్టాయినీస్, షాహీన్ అఫ్రిదీ, శుభ్ మన్ గిల్, అలీఖాన ఉన్నారు. ఇది వెస్టిండీస్, అమెరికాలో మ్యాచ్ లు జరిగే వేదికలను ప్రదర్శించింది. ఆతిథ్య దేశాలలో తొమ్మిది నగరాలలో వీటిని అభిమానుల కోసం ప్రదర్శించనున్నారు. వీటిలో న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్, మియామీ, డల్లాస్ లో వీటిని ప్రదర్శించేలా ఐసీసీ ప్రణాళిక రూపొందించింది.


Read More
Next Story