టీ20 వరల్డ్ కప్: పాండ్యాకు.. రోహిత్, అగార్కర్ పెట్టిన షరతు ఏంటీ?
x

టీ20 వరల్డ్ కప్: పాండ్యాకు.. రోహిత్, అగార్కర్ పెట్టిన షరతు ఏంటీ?

వచ్చే టీ20 వరల్డ్ కప్ జట్టులో పేస్ ఆల్ రౌండర్ హర్దిక్ పాండ్యా ఉంటాడా? సెలక్షన్ కమిటీ మదిలో ఏముంది.


ఐపీఎల్ ముగిసిన కొద్ది రోజులకే అమెరికా- కరేబియన్ దీవులు టీ20 వరల్డ్ కప్ కు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇందుకోసం భారతజట్టును ఎంపిక చేయడానికి అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2024 ప్రతిభ ఆధారంగా కొత్త ముఖాలు జట్టులో చోటు సంపాదించుకుంటారనే ప్రచారం ఇప్పటికే జరుగుతోంది. అయితే ఇందులో టీమిండియా పేస్ ఆల్ రౌండర్ హర్దిక్ పాండ్యా ఉంటాడా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

పాండ్యా, ICC ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు. మొదట వారంరోజుల విశ్రాంతి అవసరమని చెప్పిన వైద్యులు.. తరువాత గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో పూర్తి విశ్రాంతి అవసరమని తేల్చారు. ఈ ప్రభావం జట్టుపై పడింది. ఫైనల్ లో భారత్, ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఆ తరువాత భారత జట్టు ఆడిన ఏ సిరీస్ లో కూడా పాండ్యా ఆడలేదు. ఐదు నెలల విరామం అనంతరం నేరుగా ఐపీఎల్ కి ఎంట్రీ ఇచ్చిన పాండ్యా తనదైన శైలిలో ఆడలేకపోతున్నాడు.
ఇప్పుడు, జూన్‌లో టీ20 ఫార్మాట్‌లో ప్రపంచకప్‌ జరగబోతోంది. ఈసారి అందరి దృష్టి పాండ్యా పునరాగమనంపైనే ఉంది. కానీ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక నివేదిక ప్రకారం, సెలెక్షన్ ప్యానెల్, కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ పాండ్యా విషయంలో ఓ షరతు పెట్టినట్లు వినికిడి.
ఇటీవల, ద్రవిడ్, BCCI సెలెక్షన్ ప్యానెల్ చీఫ్ అజిత్ అగార్కర్, రోహిత్ కలుసుకున్నారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం ప్రకారం పాండ్యా తిరిగి భారత జట్టులోకి రావాలంటే క్రమం తప్పకుండా బౌలింగ్ వేసి తన ప్రతిభను నిరూపించుకోవాలని, అలాగైతేనే జట్టులో స్థానం ఉండాలని చర్చించినట్లు సమాచారం.
గత వారం ముంబైలోని BCCI ప్రధాన కార్యాలయంలో జరిగిన రెండు గంటల సమావేశంలో వచ్చే ప్రపంచ కప్ జట్టుకోసం సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. అందులోనే ఈ నిర్ణయానికి వచ్చారట. జట్టు ఎక్కువగా సీమ్ బౌలింగ్ అల్ రౌండర్ గురించి వెతుకుతున్నట్లు, పాండ్యా కాకుండా ఎవరైనా ప్రభావవంతమైన యువకుడు ఉన్నాడా అని కూడా చర్చించినట్లు తెలిసింది.
ఐపీఎల్ 2024లో పాండ్యా బౌలింగ్ చేస్తున్నప్పటికీ, అంతగా ప్రభావం చూపలేకపోయాడు. బ్యాట్ తోనూ అనుకున్నంత మేర రాణించలేకపోయాడు. ఏప్రిల్ 17 వరకు, MI ఆడిన ఆరు మ్యాచ్‌లలో నాలుగింటిలో పాండ్యా బౌలింగ్ చేసి కేవలం మూడే వికెట్లు పడగొట్టాడు. ఇందులో పాండ్యా ఏకంగా 12.00. ఎకానమీ రేటుతో పరుగులు సమర్పించుకున్నాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్ బౌలింగ్ కు దిగిన హర్దిక్ ను ధోని చుక్కలు చూపాడు. వరుసగా మూడు సిక్సర్లు బాది ఏకంగా 26 పరుగులు సాధించాడు. దీనితోడు రోహిత్ ను కాదని పాండ్యాను కెప్టెన్ గా చేయడం పై ముంబై అభిమానులు తరుచుగా అతడిని హేళన చేస్తున్నారు.
Read More
Next Story